బాత్ రూమ్ లో సీక్రెట్ మైక్స్, కెమెరాలు... బిగ్ బాస్ హౌస్ బాగోతం బయటపెట్టిన మాజీ కంటెస్టెంట్!

Published : Jul 22, 2024, 07:46 AM IST

బిగ్ బాస్ హౌస్ రహస్యాలు బయటకు వచ్చాయి. చివరకు బాత్ రూమ్ లో కూడా రహస్య మెక్స్, ప్రతి చోటా కనిపించని కెమెరాలు ఉంటాయట. కంటెస్టెంట్స్ మాట్లాడే ప్రతిదీ మేకర్స్ వింటారన్న షాకింగ్ మేటర్ మాజీ కంటెస్టెంట్ లీక్ చేశాడు.   

PREV
18
బాత్ రూమ్ లో సీక్రెట్ మైక్స్, కెమెరాలు... బిగ్ బాస్ హౌస్ బాగోతం బయటపెట్టిన మాజీ కంటెస్టెంట్!
Bigg Boss Telugu

బిగ్ బాస్ తెలుగు 8కి నగారా మోగింది. స్టార్ మా అధికారిక ప్రకటన చేసింది. జులై 21న బిగ్ బాస్ సీజన్ 8 లోగో విడుదల చేశారు. లేటెస్ట్ సీజన్ లోగోతో కూడిన ప్రోమోని నాగార్జున తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశాడు. మీకు వినోదం పంచేందుకు మరలా మేము తిరిగి వచ్చాము. బిగ్ బాస్ తెలుగు 8 లోగో ప్రజెంట్ చేస్తున్నాను. మీకు బిగ్ బాస్ 8తో అనంతమైన ఎంటర్టైన్మెంట్ పంచుతామని... నాగార్జున కామెంట్ చేశారు.

28
Bigg Boss House


బిగ్ బాస్ సీజన్ 8 లోగో ఆకట్టుకుంది. చాలా కలర్ఫుల్ గా డిజైన్ చేశారు. సీజన్ నెంబర్ సూచించే 8 సంఖ్య డిజైన్ ఇన్ఫినిట్(అనంతం) సింబల్ ని తలపిస్తుంది. లోగో మధ్యలో ఒక పువ్వుని మనం చూడొచ్చు. ఈ లోగోలో కూడా సీజన్ 8కి సంబంధించిన అనేక వివరాలు ఉన్నాయని చెప్పొచ్చు. 
 

38
Bigg Boss House

కాగా బిగ్ బాస్ హౌస్ ఎలా ఉంటుంది? దాని డిజైన్ ఏమిటి? అనే విషయాలు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ తెలియజేశాడు. సీజన్ 6లో కంటెస్టెంట్ చేసిన ఆదిరెడ్డి లేటెస్ట్ వీడియోలో బిగ్ బాస్ హౌస్ ని ఉద్దేశించి మాట్లాడాడు. ఆ ఇంటికి సంబంచింది మనకు తెలియని రహస్యాలు బయటపెట్టాడు. ఆదిరెడ్డి బిగ్ బాస్ రివ్యూవర్. 
 

48
Bigg Boss House


ఆదిరెడ్డి ప్రకారం... షో మొదలు కావడానికి ఒక నెల రోజుల ముందే బిగ్ బాస్ హౌస్ నిర్మాణం పూర్తి చేస్తారట. ఈ నెల రోజులు ఆ ఇంటిని క్షుణ్ణంగా పరిశీలిస్తారట. ఎలాంటి లోపాలు ఉన్నా... వాటిని సరి చేస్తారట. ఇంత వరకు మనకు తెలియని విషయం ఏమిటంటే... బిగ్ బాస్ హౌస్లో సీక్రెట్ మైక్స్, కెమెరాలు ప్రతి చోటా ఉంటాయట. 

58
Bigg Boss House

చివరికి బిగ్ బాస్ హౌస్ బాత్ రూమ్ లో కూడా సీక్రెట్ మైక్స్ ఉంటాయట. కంటెస్టెంట్స్ బాత్ రూమ్స్ కి వెళ్లే ముందు మైక్ బయట పెట్టి పోతారు. అక్కడ ఏం మాట్లాడినా బిగ్ బాస్ నిర్వాహకులకు వినపడదు అనుకుంటే పొరపాటేనట. బాత్ రూమ్ లో మాట్లాడినా వారు సీక్రెట్ మైక్స్ ద్వారా వింటారట.

68
Bigg Boss House

మైక్స్ బ్యాటరీస్ తో పని చేస్తాయి. బ్యాటరీస్ ఛార్జ్ అయిపోతే స్టోర్ రూమ్ కి వెళ్లి మారుస్తారు. బ్యాటరీస్ తీసేసినప్పుడు మైక్ పని చేయడం లేదని కంటెస్టెంట్స్ నోరు జారతారు. కానీ సీక్రెట్ మైక్స్ వారి మాటలను రికార్డు చేస్తాయట. మైక్స్ వలె హౌస్ మొత్తం సీక్రెట్ కెమెరాలు ఉంటాయట. 

 

78
Bigg Boss House

కాబట్టి కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లో ఆచితూచి మాట్లాడాలి. వారి ప్రతి మూమెంట్ ని, కామెంట్స్ ని వారు గమనిస్తూనే ఉంటారట. ఆదిరెడ్డి చెప్పిన ఈ విషయాలు సంచలనం రేపుతున్నాయి. బిగ్ బాస్ హౌస్ డిజైన్ కూడా కంటెస్టెంట్స్ మానసిక స్థితిని ప్రభావితం చేస్తుందట. మల్టీ కలర్స్ తో కూడిన హౌస్ విసుగు, అసహనం కలిగేలా చేస్తాయనే ఓ వాదన ఉంది. 

88
Bigg Boss House


ఇక బిగ్ బాస్ తెలుగు 8 మరో మూడు నాలుగు వారాల్లో మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ ప్రోమో సైతం వచ్చిన నేపథ్యంలో... సర్వం సిద్ధం అవుతుందని భావించవచ్చు. వరుసగా ఆరో సీజన్ కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. కంటెస్టెంట్స్ వీరే అంటూ ఓ లిస్ట్ వైరల్ అవుతుంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories