వెయ్యి కోట్ల సత్తా ఉన్న హీరోలు వీరే.. ప్రభాస్, అమీర్‌, షారూఖ్‌, యష్‌.. అక్కడి నుంచి ఒక్కరు కూడా లేరే!

Published : Jul 22, 2024, 12:52 AM ISTUpdated : Jul 22, 2024, 10:28 PM IST

స్టార్‌ హీరోల మధ్య పోటీ పెరిగింది. పాన్‌ ఇండియా ట్రెండ్‌ నడుస్తున్న నేపథ్యంలో కలెక్షన్ల పరంగానూ పోటీ నెలకొంది. మరి వెయ్యి కోట్ల సత్తా ఉన్న హీరోలు ఎవరో తెలుసా?  

PREV
16
వెయ్యి కోట్ల సత్తా ఉన్న హీరోలు వీరే.. ప్రభాస్, అమీర్‌, షారూఖ్‌, యష్‌.. అక్కడి నుంచి ఒక్కరు కూడా లేరే!

ఒకప్పుడు వందకోట్లు వసూలు చేయడం అంటే పెద్ద గొప్ప. కానీ ఇప్పుడు ఆ లెక్కలు మారిపోయాయి. 500కోట్లు కూడా ఈజీ అయిపోయాయి. ఇటీవల చాలా సినిమాలు ఐదు వందల కోట్లు వసూలు చేస్తున్నాయి. అంతే కాదు ఆ కాలుక్కులేషన్స్ కూడా మారిపోయాయి. వెయ్యి కోట్ల ట్రెండ్ నడుస్తుంది. మరి ఇప్పటి వరకు 1000 కోట్లు వసూలు చేసిన సినిమాలు ఏంటి, ఆ సత్తా ఉన్న హీరోలు ఎవరు అనేది చూస్తే..
 

26

ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `కల్కి 2898 ఏడి`. నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ మూవీ గత నెలలో విడుదలై సంచలన విజయం సాధించింది. కలెక్షన్ల పరంగా ఇది వెయ్యి కోట్లు దాటింది. 1100 కోట్ల దిశగా వెళ్తుంది. వెయ్యి కోట్ల సినిమాలు ప్రభాస్ ఖాతాలో రెండు ఉన్నాయి.  అసలు వెయ్యి కోట్లు ఇండస్ట్రీ కి పరిచయం చేసిందే ప్రభాస్. ఆయన `బాహుబలి 2` తో ఫస్ట్ టైం వెయ్యి కోట్లు ఇండియన్ సినిమాకి ఇంట్రడ్యూస్ చేశారు. ఈ మూవీ ఏకంగా 1800 కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. రాజమౌళి క్రియేషన్ కి ప్రభాస్ ఇమేజ్ తోడు కావడంతో సినిమా దుమ్మురేపింది.

36

ఆ తర్వాత వెయ్యికోట్ల సినిమా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ కి సాధ్యమైంది. `దంగల్` సినిమా ప్రపంచ వ్యాప్తంగా సుమారు రెండు వేల కోట్లు చేసిందంటారు. అయితే ఇందులో చైనా కలెక్షన్ ఉన్నాయి. ఏది ఏమైనా ఆమీర్ వెయ్యి కోట్ల ఖాతాలో ఉన్నారు.
 

46
Jawan

 బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ అకౌంట్ లో వెయ్యి కోట్ల సినిమాలు రెండు ఉండడం విశేషం. ఆయన గత ఏడాదే రెండు వెయ్యి కోట్ల సినిమాలు చేశారు. `పఠాన్` తో వెయ్యి కోట్లు కొల్లగొట్టిన ఆయన.. ఆరు నెలల గ్యాప్ తో `జవాన్` తో ఏకంగా 1100 కోట్లు సాధించారు. ప్రభాస్ తర్వాత స్థానంలో నిలిచారు షారూక్ ఖాన్.

56

వెయ్యి కోట్ల జాబితాలో కన్నడ స్టార్ యష్ కూడా ఉన్నారు. ఆయన రెండేళ్ల క్రితం కేజీఎఫ్2 సినిమాతో సునామీ సృష్టించారు.  ప్రశాంత్ నీల్ రూపొందించిన ఈ సినిమా ఏకంగా 1200 కోట్లు చేయడం విశేషం. సౌత్ నుంచి తెలుగు కాకుండా ఈ ఘనత సాధించిన ఏకైక హీరో యష్ కావడం విశేషం.
 

66

ఫైనల్ గా వెయ్యి కోట్ల జాబితాలో మరో ఇద్దరు తెలుగు హీరోలున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ఈ రికార్డు క్రియేట్ చేశారు. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో వెయ్యి కోట్లు కొల్లగొట్టారు. ఈ మూవీ సైతం 1150 కోట్లు వసూలు చేసింది. వెయ్యి కోట్ల హీరోల జాబితాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లను నిలిపింది. వీరు సింగిల్‌గా నటిస్తున్న `గేమ్‌ ఛేంజర్‌`,  `దేవర` ఈ ఏడాది రాబోతున్నాయి. మరి ఈ జాబితాలో చేరతాయా? అలాగే `పుష్ప 2` సైతం రాబోతుంది. బన్నీ వాళ్ల సరసన చేరతాడా? అనేది చూడాలి. అయితే ఈ జాబితాలో కోలీవుడ్‌ నుంచి ఒక్క హీరో కూడా లేకపోవడం గమనార్హం.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories