ధనుష్ కోలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. కానీ తెలుగులో ఆ స్థాయి ఇమేజ్ రాలేదు. `సార్` సినిమాతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యాడు ధనుష్. కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయనే దర్శకుడిగా `రాయన్` సినిమాని తెరకెక్కించారు. తనే అందులో హీరో. సందీప్ కిషన్ మరో హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమా ఈ నెల 26న విడుదల కాబోతుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. తాజాగా ఇందులో ధనుష్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా నిలిచాయి.
ఈ ఈవెంట్‌లో ధనుష్ చాలా వరకు తమిళంలోనే మాట్లాడారు. కానీ తెలుగు ఆడియెన్స్ ని అలరించారు. ఈ సందర్బంగా చివర్లో అసలైన విషయాన్ని రివీల్ చేశారు. తెలుగులో తనకిష్టమైన హీరో గురించి చెప్పారు. ఈ విషయం చెబితే మిగిలిన హీరోల అభిమానులు ఫీల్ కావద్దని, తనని హేట్ చేయోద్దని చెబుతూ, పవన్ కళ్యాణ్ సర్ అంటే తనకు ఇష్టమని తెలిపారు ధనుష్. దీంతో ప్రాంగణమంతా దద్దరిల్లిపోయింది.
మరోవైపు మల్టీస్టారర్ సినిమా చేయాల్సి వస్తే.. అని యాంకర్ అడిగిన ప్రశ్నకి ధనుష్ ఇంట్రెస్టింగ్ గా రియాక్ట్ అయ్యాడు. ఆయన ఎన్టీఆర్ పేరు చెప్పారు. తారక్‌తో తాను మల్టీస్టారర్ సినిమా చేసేందుకు రెడీ అన్నాడు. తెలుగులో ఆయనతో కలిసి నటించాలని ఉందని చెప్పారు. ఎన్టీఆర్ నటన తనకు ఇష్టమని ఓపెన్‌గా చెప్పేశాడు ధనుష్. ఇలా తెలుగు ఆడియెన్స్ కి మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నించాడు. అంతేకాదు, ఈ ఇద్దరు అభిమానులను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు.
ఇందులో మరో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ధనుష్. `రాయన్` సినిమాని తనే స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తూ హీరోగా నటించిన నేపథ్యంలో తన పాత్రలో తాను కాకుండా మరే హీరో అయితే బాగుంటుందనే ప్రశ్నకి ధనుష్ సంచలన కామెంట్ చేశాడు. రజనీకాంత్ అయితే ఈ పాత్రకి సెట్ అవుతారని, తాను కాకపోతే రజనీతో ఈ సినిమా చేస్తానని చెప్పాడు ధనుష్. ఇలా ముగ్గురు సూపర్ స్టార్ల పేర్లు చెప్పి ఇప్పుడు అందరి అభిమానులను తనవైపు తిప్పుకున్నాడు ధనుష్. మరి ఇది `రాయన్` సినిమాకి ఏమేరకు ఉపయోగపడుతుందో చూడాలి.
Nagarjuna Kubera
ప్రస్తుతం ధనుష్ తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో `కుబేర` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నాగార్జున మరో హీరో. ఈ మల్టీస్టారర్ మూవీ చిత్రీకరణ దశలో ఉంది.ఈ సినిమా చేయడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. నాగార్జున సర్‌తో పనిచేయడం అద్భుతమైన అనుభవం అని చెప్పారు ధనుష్.