Bigg Boss Telugu6: గెటప్ శ్రీను, ఉదయభాను, అనుదీప్ లతో పాటు షోకి వెళుతున్న క్రేజీ కంటెస్టెంట్స్ లిస్ట్?

Published : May 27, 2022, 01:33 PM IST

బిగ్ బాస్ సీజన్ 6 కి నగారా మోగింది. హోస్ట్ నాగార్జునతో కూడిన ప్రోమో విడుదలైంది. ఈసారి తమ షోలో సామాన్యులకు అవకాశం ఇస్తున్నట్లు నాగార్జున ప్రకటించారు. దాదాపు నెలరోజుల్లో బిగ్ బాస్ తెలుగు 6 ప్రారంభం కానుంది.   

PREV
17
Bigg Boss Telugu6: గెటప్ శ్రీను, ఉదయభాను, అనుదీప్ లతో పాటు షోకి వెళుతున్న క్రేజీ కంటెస్టెంట్స్ లిస్ట్?
Bigg boss 6


ఈ తరుణంలో లేటెస్ట్ సీజన్లో పాల్గొనే సెలబ్రిటీల పేర్లు తెరపైకి వచ్చింది. ఎప్పటిలాగే సోషల్ మీడియా సెలబ్రిటీలతో పాటు బుల్లితెర స్టార్స్ ని హౌస్ లోకి పంపుతున్నట్లు సమాచారం అందుతుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ సారి హౌస్ లోకి వెళ్లే అవకాశమున్న కంటెస్టెంట్స్ ఎవరో చూద్దాం... 
 

27
Bigg boss 6

స్టార్ యాంకర్ ఉదయభాను బిగ్ బాస్ 6 (Bigg boss telugu 6) లో పాల్గొంటున్నారట. ఒకప్పటి ఈ బిజీ యాంకర్ వ్యక్తిగత కారణాలతో పరిశ్రమకు దూరమయ్యారు. ఇటీవల కమ్ బ్యాక్ ఇచ్చిన ఈ పొడుగు యాంకర్ షోలు చేస్తున్నారు. ఓ దశలో ఉదయభాను అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ క్రేజ్. సుమ కూడా ఆమె తర్వాతే. ఉదయభాను హీరోయిన్ గా కూడా సినిమాలు చేశారు. అనసూయ, రష్మీ లాంటి యాంకర్స్ కి ఆమె స్ఫూర్తి.

37
Bigg boss 6

ఉదయభాను షోలో పాల్గొంటే భారీ హైప్ వచ్చినట్లే. అలాగే జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను (Getup Srinu)పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. షో నిర్వాహకులు ఆయన్ని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారట. మంచి పారితోషికం ఆఫర్ చేస్తే గెటప్ శ్రీను రంగంలోకి దిగడం ఖాయం. ఆయనొస్తే ఎంటర్టైన్మెంట్ కి కొరత లేనట్లే. జబర్దస్త్ కూడా వదిలేసిన గెటప్ శ్రీను బిజీ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తున్నారు. 
 

47

సీరియల్ నటుడు అనుదీప్ చౌదరి షోలో పాల్గొనడం దాదాపు ఖాయమే అన్న మాట వినిపిస్తోంది. ఈమేరకు అతడు నిర్వాహకులకు పచ్చ జెండా ఊపాడట. బుల్లితెర ప్రేక్షకుల్లో అనుదీప్ కి మంచి పాపులారిటీ ఉంది. ఈ సీజన్ కి వినిపిస్తున్న మరో పాప్యులర్ నేమ్ ఆర్జే హేమంత్. కమెడియన్ పలు చిత్రాల్లో నటించిన ఆర్జే హేమంత్ జాంబీ రెడ్డి మూవీలో ఫుల్ లెంగ్త్ రోల్ చేశారు. ఆర్జే హేమంత్ రాకుంటే బిగ్ బాస్ నాన్ స్టాప్ లో పాల్గొన్న ఆర్జే చైతూ వచ్చే అవకాశం కలదు. బిగ్ బాస్ నాన్ స్టాప్ లో చైతూ ఎక్కువ కాలం ఉండలేదు. 

57
Bigg boss 6


ఇక గ్లామరస్ న్యూస్ యాంకర్స్ గా రోజా, ప్రత్యూష ఫేమస్. వీరిద్దరికి కూడా బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. టీవీ9 ప్రత్యూష, రోజాలలో ఎవరో ఒకరు కచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొనే అవకాశం కలదు. ఇద్దరూ వచ్చినా ఆశ్చర్యం లేదు. షో నిర్వాహకులు ఇద్దరి పట్ల ఆసక్తిగా ఉన్నారట. 

67
Bigg boss 6

ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ లో పాల్గొన్న అనిల్ రాథోడ్, యాంకర్ శివ, నటుడు అజయ్, మిత్ర శర్మ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీరిలో యాంకర్ శివ, మిత్ర శర్మ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అనిల్, శివ, మిత్ర శర్మ ఫైనల్ కి చేరిన విషయం తెలిసిందే.

77
Bigg boss 6

ఇక బిగ్ బాస్ సీజన్ 6 రేసులో సింగర్ మామ సింగ్ అలియా కృష్ణ చైతన్య, నటుడు కౌశిక్, యూట్యూబర్ నిఖిల్ పేర్లు వినిపిస్తున్నాయి. మరి వీరిలో నిజంగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేది ఎవరని తెలియాలంటే ఫస్ట్ ఎపిసోడ్ వరకూ ఆగాలి. షో నిబంధనల ప్రకారం ఫస్ట్ ఎపిసోడ్ లోనే కంటెస్టెంట్స్ ని పరిచయం చేస్తారు.

click me!

Recommended Stories