బిగ్ బాస్ 5: ఏకంగా క్వారంటైన్ లో 20మంది టాప్ సెలెబ్రిటీలు, యాంకర్ రవి, వర్షిణి, ప్రియ, షణ్ముఖ్ లతో పాటు..

Published : Aug 27, 2021, 12:04 PM IST

వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కి నగారా మోగింది. కేవలం మరో పది రోజులలో గ్రాండ్ గా షో లాంచ్ కానుంది. సెప్టెంబర్ 5న బిగ్ బాస్ సీజన్ 5 మొదటి ఎపిసోడ్ ప్రసారం కానుంది. 

PREV
111
బిగ్ బాస్ 5: ఏకంగా క్వారంటైన్ లో 20మంది టాప్ సెలెబ్రిటీలు, యాంకర్ రవి, వర్షిణి, ప్రియ, షణ్ముఖ్ లతో పాటు..

గత నాలుగు సీజన్స్ భారీ టీఆర్పీతో ఊహించని సక్సెస్ సాధించాయి. ఈ నేపథ్యంలో సీజన్ ఫైవ్ మరింత ఆసక్తిగా నిర్వాహకులు సిద్ధం చేస్తున్నారు. 
 

211


సీజన్ 3, సీజన్ 4కి హోస్ట్ గా వ్యవహరించిన కింగ్ నాగార్జున మరోమారు బిగ్ బాస్ వేదికపై మెరవనున్నారు. ఈసారి హోస్ట్ మారుతున్నారనే ఊహాగానాలకు చెక్ పెడుతూ... లేటెస్ట్ సీజన్ కోసం ఆయన రంగంలోకి దిగిపోయారు. 

311

ఈసారి బిగ్ బాస్ షోకి మిగతా షోస్ నుండి భారీ పోటీ ఎదురుకానుంది. ఎన్టీఆర్ హోస్ట్ గా జెమినీలో ఎవరు మీలో కోటీశ్వరులు ప్రసారం అవుతుంది. ఎన్టీఆర్ మాయాజాలం తట్టుకొని నిలబడాలంటే బిగ్ బాస్ షో మరింత ఆకర్షణీయంగా సిద్ధం చేయాలి. 

411

అదే సమయంలో ఐపీల్ కూడా ప్రసారం కానుంది. ముఖ్యంగా రెండు ఈవెంట్స్ ని దృష్టిలో ఉంచుకొని బిగ్ బాస్ కోసం ఎక్కువ మంది అమ్మాయిలతో గ్లామర్ డోస్ పెంచారన్న మాట వినిపిస్తుంది.

511

ఇక కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తి కావడంతో పాటు, హౌస్లోకి వెళ్లనున్న సెలెబ్రిటీలను నిర్వాహకులు క్వారంటైన్ కి తరలించారట.

611

బిగ్ బాస్ సీజన్ 4లో చెప్పుకోదగ్గ సెలెబ్రిటీలు పాల్గొనలేదు. ఆ విషయం ప్రేక్షకులను ఒకింత నిరాశకు గురిచేసింది. ఈ నేపథ్యంలో ఈసారి టాప్ సెలెబ్రిటీలను షోకి ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. 
 

711

అలాగే ఏకంగా 20మంది సెలెబ్రిటీలు క్వారంటైన్ లో ఉన్నారట. వీరిలో 16మందిని మొదటి ఎపిసోడ్ ద్వారా హౌస్లోకి పంపి, మిగతా కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డు ఎంట్రీల ద్వారా హౌస్లోకి ప్రవేశ పెట్టనున్నారట. 
 

811


ఒకేసారి 20మందిని కూడా పంపే అవకాశం లేకపోలేదనేది మరో వాదన. గత సీజన్స్ మాదిరి, షో సూపర్ సక్సెస్ కావాలని గేమ్స్, కాంట్రవర్సి జోడించి, షో సిద్ధం చేస్తున్నారు.

911


 
మీడియా, టెలివిజన్ వర్గాల సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 5కి హౌస్లోకి వెళ్ళడానికి క్వారంటైన కి వెళ్లిన  లిస్ట్ ఇదే... 

1011


యాంకర్ రవి, నటుడు పడాల జస్వంత్,యూట్యూబ్ నటి సిరి హన్మంత్,యూట్యూబర్ షణ్ముఖ్, నటి శ్వేతా వర్మ,నటి లహరి శ్రీ ,కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్,నటుడు విజే సన్నీ, జబర్దస్త్ ప్రియాంక,యూట్యూబర్ ఆర్జే కాజల్,నటుడు లోబో, నటి ప్రియా.

1111

 నటుడు మానస్, నటి ఉమాదేవి, నటుడు దీపక్ సరోజ్,యాంకర్ వర్షిణి,నటి పూనమ్ బజ్వా, ఆట సందీప్, నటుడు విశ్వ,యూట్యూబ్ సరయు, నటరాజ్ మాస్టర్.. ఉన్నారు. 
 

click me!

Recommended Stories