మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన విష్ణు టాలీవుడ్ లో హీరోగా రాణిస్తున్నారు. ప్రస్తుతం విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే.
మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన విష్ణు టాలీవుడ్ లో హీరోగా రాణిస్తున్నారు. ప్రస్తుతం విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల విష్ణు కమెడియన్ అలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అలీతో సరదాగా షోకి గెస్ట్ గా హాజరయ్యారు.
26
ఈ ఇంటర్వ్యూలో మంచు విష్ణు తన కెరీర్, ఫ్యామిలీ గురించి అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మంచు విష్ణు సతీమణి వెరోనికా సీఎం జగన్ కు బంధువు. ఆ సంగతి అందరికి తెలిసిందే.
36
వెరోనికా, విష్ణు దంపతులకు ప్రస్తుతం నలుగురు పిల్లలు ఉన్నారు. విష్ణు, వెరోనికా దంపతులు ఇంతమంది పిల్లలని కనడంపై ఫన్నీ కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనిపై విష్ణు స్పందించాడు. నాకు పిల్లలంటే ఇష్టం. పదిహేను మంది పిల్లలు ఉన్నా పర్వాలేదు.
46
ఇంతమంది పిల్లలని కనాలని మేము ప్లాన్ చేసుకోలేదు. అలా జరిగింది. విన్నీ ప్రతి వారం తన ఫ్యామిలీ మెంబర్స్ ని కలుసుకుంటుంది. గతంలో షర్మిలక్కని కలిశాం. అప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారు. విన్నీ నాలుగో బిడ్డకు గర్భవతిగా ఉంది. మా విన్నీని ఎందుకు ఇబ్బంది పెడతావ్.. ఇక చాలు ఆపేయ్ అని షర్మిలక్క సరదాగా తిట్టింది.
56
అదే సమయంలో జగన్ కూడా మాట్లాడారు. విష్ణు.. మా సిస్టర్ ని ఇబ్బంది పెట్టకు.. నలుగురు చాలు ఆపేయ్ సరదాగా తిట్టారు. అది చాలా ఫన్నీ ఇన్సిడెంట్ అని మంచు విష్ణు అన్నారు. తమతో జగన్ ఎంత సరదాగా ఉంటారో విష్ణు తెలిపాడు.
66
ఇక ఇంతమంది పిల్లలని కనడంపై విష్ణు తన సతీమణి రియాక్షన్ తెలిపారు. ఇంకో బిడ్డ కావాలా విన్నీ అని సరదాగా అడిగితే.. ఇంకొకరిని చూసుకోపో అని కసిరేస్తుంది అంటూ విష్ణు నవ్వుతూ తెలిపారు.