Bigg Boss telugu5... వరస్ట్ పెరఫార్మర్ గా జైలుపాలైన శ్వేత... సిరి, షణ్ముఖ్ మధ్య గిల్లి కజ్జాలు!

Published : Oct 16, 2021, 12:37 AM ISTUpdated : Oct 16, 2021, 12:42 AM IST

బిగ్ బాస్ సీజన్ 5 సప్పగా సాగుతుంది. గత సీజన్స్ తో  పోల్చుకుంటే లేటెస్ట్ సీజన్ ఏ విధంగా ప్రేక్షకులకు ఆసక్తి కలిగించడం లేదు

PREV
16
Bigg Boss telugu5... వరస్ట్ పెరఫార్మర్ గా జైలుపాలైన శ్వేత... సిరి, షణ్ముఖ్ మధ్య గిల్లి కజ్జాలు!

పగల గొట్టినవారిదే పండగ పేరుతో బిగ్ బాస్ నిర్వహించిన పలు గేమ్స్ తో ఇద్దరు చొప్పున పోటీపడ్డారు. విశ్వపై షణ్ముఖ్ గెలుపొందారు. ప్రియపై కాజల్ గెలిచారు. యాని మాస్టర్ లోబో తపడిన గేమ్ లో లోబో గెలిచారు. మరో గేమ్ లో శ్వేత, ప్రియాంక  తలపడ్డారు.. ఈ గేమ్ లో శ్వేత గెలిచారు. గెలిచిన సభ్యులు మటన్, కాపీ, ఆపిల్స్ వంటి లగ్జరి బడ్జెట్ గెలుచుకున్నారు.
 

26

 
ఇక ఈ ఎపిసోడ్ లో ఎప్పటిలాగే సిరి, షణ్ముఖ్ మధ్య గిల్లికజ్జాలు నడిచాయి. నాకు క్యారెక్టర్ లేదు అంటావా అంటూ సిరి కన్నీళ్లు పెట్టుకుంది. నిన్ను ఉడికిద్దామని అలా అన్నాను.. అంటూ షణ్ముఖ్ సమాధానం చెప్పారు. 

36

 ప్రియాంక వ‌చ్చి నాకు ప్ర‌పోజ్ చేయాల్సివ‌స్తే ఎలా చేస్తావు? అని జెస్సీని అడిగింది. అత‌డు నిర్మొహ‌మాటంగా నేను చెయ్య‌ను అని తేల్చి చెప్పాడు. ఒక‌వేళ చెయ్యాల్సి వ‌స్తే స‌చ్చిపోతాడు, కానీ చెయ్య‌డు అని కౌంట‌రిచ్చాడు ష‌ణ్ను. దీంతో రూటు మార్చిన పింకీ.. త‌న‌ను సిరి అనుకుని ప్ర‌పోజ్ చేయ‌మంది. చేస్తే సిరికే చేస్తానంటూ పంచ్ ఇచ్చాడు జెస్సీ. ఇది విన్న ష‌ణ్ను.. ఆమె నీకు ఏ యాంగిల్‌లో న‌చ్చిందిరా అంటూ జోకేయ‌డంతో సిరి ఏడ్చేసింది.


 

46

ఇక హౌస్ లో కంటెస్టెంట్ మధ్య కుంపటి పెట్టె టాస్క్ బిగ్ బాస్ నిర్వహించారు. ప్రతి ఒక్కరు వరస్ట్ పెరఫార్మర్ ని ఎంచుకోవాలి అన్నారు. నచ్చని వారిపై స్టాంప్ వేయాలని, అత్యధికంగా స్టాంప్స్ పెద్దవాళ్లు జైలుకి వెళతారు అన్నారు.  ఈ టాస్క్ లో మెజారిటీ ఓట్లు శ్వేత‌కు ప‌డ‌టంతో ఆమెను జైలుకు పంపించారు.

56


ర‌విని క్ష‌మించ‌లేక‌పోతున్నాన‌ని మాన‌స్‌తో చెప్పుకొచ్చింది కాజ‌ల్‌. ఫేస్ చూసి మోస‌పోక‌ని, సింప‌తీగా ఫేస్ పెడితే న‌మ్మేయ‌క‌ని నొక్కి చెప్పాడు మాన‌స్‌. ర‌వి ఫేక్‌గా ఉంటున్నాడు కాబ‌ట్టే క్ష‌మించ‌లేక‌పోతున్నానంది కాజ‌ల్‌.

66

మ‌రోప‌క్క‌ ర‌వి ఐడియాకు తాను బ‌ల‌య్యాన‌ని జైలులో ఏడ్చేసింది శ్వేత‌. దీంతో యానీ మాస్ట‌ర్ ఆమెను ఓదార్చింది. ఇక‌ అర్ధ‌రాత్రి అవుతున్నా శ్వేత నిద్ర‌పోక‌పోవ‌డంతో యానీ కూడా జాగారం చేసింది.

Also read డిశ్చార్జ్ అయిన సాయిధరమ్ తేజ్, బర్త్ డే రోజునే.. ఇది పునర్జన్మ.. చిరు, బన్నీ ట్వీట్

Also read బ్లాక్‌ డ్రెస్‌లో క్యూట్‌ ఎక్స్ ప్రెషన్స్ తో గిలిగింతలు పెడుతున్న పూజా హెగ్డే.. బర్త్ డే ఫోటోలు..

click me!

Recommended Stories