నీపై నాకు ఇంట్రెస్ట్ లేదు... ఆ ఒక్క మాటలో సిరిని ఒంటరిని చేసిన షణ్ముఖ్, కన్నీరు పెట్టుకుంటూ....

First Published Sep 23, 2021, 2:58 PM IST

బిగ్ బాస్(Biggboss) హౌస్ వేదికగా ప్రేమలు చిగురించడం, ముక్కు ముఖం తెలియని అబ్బాయి, అమ్మాయి ప్రేమ పక్షులుగా మారడం మనం చూశాం.ప్రతి సీజన్లో ఒకటో రెండో ప్రేమజంటలు తయారవుతుండగా, లేటెస్ట్ సీజన్లో యూట్యూబ్ సెలెబ్రిటీలు షణ్ముఖ్, సిరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . 

తాజా బిగ్ బాస్ ప్రోమో చూస్తే నిజంగా షణ్ముఖ్, సిరి ఒకరిని వదిలి మరొకరు ఉండలేరేమో అనిపిస్తుంది. ముఖ్యంగా షణ్ముఖ్ కోసం సిరి పరితపిస్తున్న భావన కలుగుతుంది. తన వెంటబడుతున్న సిరిపై షణ్ముఖ్ సీరియస్ అయ్యాడు. నీపై నాకు ఇంటరెస్ట్ లేదని హేట్ కామెంట్ చేశారు. 

షణ్ముఖ్ వెనకాలే తిరుగుతున్న సిరిని.. ఒంటరిగా వదిలేయాలని షణ్ముఖ్ కోరుకున్నాడు. అయినా సిరి వదలకపోవడంతో నోరు జారీ ఏదో ఒకటి అనేస్తాను దూరంగా వెళ్ళమని షణ్ముఖ్ ఆమెతో చెప్పాడు. నువ్వు తిట్టినా పర్లేదు, నువ్వు అలా తిడితే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుందని సిరి అంది. 
 
నాకు ఇంట్రెస్ట్ లేదని షణ్ముఖ్ సిరి ఫేస్ పై చెప్పేశాడు. ఈ మాటను కూడా సీరియస్ గా తీసుకోని సిరి.. నేనేమైన నీ గర్ల్ ఫ్రెండ్ నా రా ఇంట్రెస్ట్ లేదని చెప్పడానికి అని షణ్ముఖ్ ని ప్రశ్నించింది. జస్ట్ ఫ్రెండ్షిప్ కి కూడా ఇంటరెస్ట్ లేదు. ప్లీజ్ వెళ్ళిపో అనడంతో సిరి బాగా హర్ట్ అయ్యింది. 

అక్కడి నుండి సీరియస్ గా వెళ్ళిపోయి, ఒంటరిగా కూర్చొని ఏడవడం మొదలుపెట్టింది. షణ్ముఖ్ ని వదిలి ఉండలేని స్థితిలో సిరి ఉందని, తాజా బిగ్ బాస్ ప్రోమో చూస్తే అర్థం అవుతుంది. 

click me!