బిగ్ బాస్ రవికృష్ణతో బ్రేకప్ చేసుకున్న నటి నవ్య.. ఐ ట్రూలీ లవ్యూ అంటూనే, కారణం ఇదే

First Published Jan 25, 2022, 4:27 PM IST

బుల్లితెరపై నటీనటులు, బిగ్ బాస్ సెలెబ్రిటీల మధ్య తరచుగా లవ్ ఎఫైర్ రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. సుడిగాలి సుధీర్, రష్మీ.. దీప్తి సునైనా, షణ్ముఖ్ లాంటి సెలెబ్రిటీల మధ్య ప్రేమ వార్తలు తరచుగా చూస్తూనే ఉన్నాం. 

బుల్లితెరపై నటీనటులు, బిగ్ బాస్ సెలెబ్రిటీల మధ్య తరచుగా లవ్ ఎఫైర్ రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. సుడిగాలి సుధీర్, రష్మీ.. దీప్తి సునైనా, షణ్ముఖ్ లాంటి సెలెబ్రిటీల మధ్య ప్రేమ వార్తలు తరచుగా చూస్తూనే ఉన్నాం. అలా ప్రేమాయణం సాగిస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తున్న జంటలలో బిగ్ బాస్ రవికృష్ణ, నటి నవ్య కూడా ఉన్నారు. 

వీరిద్దరూ జంటగా టివి సీరియల్స్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా వీరిద్దరూ యాంకర్ సుమ హోస్ట్ గా చేసే క్యాష్ ప్రోగ్రాం కి హాజరయ్యారు. వీరితో పాటు రియల్ లైఫ్ కపుల్ సిద్ధార్థ్, విష్ణుప్రియ కూడా క్యాష్ ప్రోగ్రాంకి హాజరయ్యారు. 

ఈ ప్రోగ్రాంలో ఈ రెండు జంటల మధ్య రొమాన్స్ హాట్ టాపిక్ గా మారింది. సిద్దార్థ్, విష్ణుప్రియ అంటే కపుల్స్.. కానీ రవికృష్ణ, నవ్యకూడా రొమాన్స్ లో మునిగితేలారు. విష్ణుప్రియ.. సిద్దార్థ్ బుగ్గలకు లిప్స్టిక్ అంటేలా ముద్దులు ఇచ్చింది. అలాగే ఈ రెండు జంటలు ఊ అంటావా మావ సాంగ్ కి స్టెప్పులేశారు. 

సినిమాల్లోని హీరో హీరోయిన్ల ఫోజుల్లో వీరి కూడా కనిపించారు. అయితే రవికృష్ణ, నవ్య మధ్య జరిగిన సంభాషణ వైరల్ గా మారింది. మనిద్దరి పెళ్ళికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదు అని నవ్య.. రవికృష్ణతో చెబుతుంది. అదేంటి.. మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా మనిద్దరం పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాం కదా అని రవికృష్ణ అంటాడు. 

సారీ రవి.. నేను మా పేరెంట్స్ ని హర్ట్ చేయలేను. ఐ ట్రూలీ లవ్యూ.. కానీ మనిద్దరం విడిపోక తప్పదు అని చెప్పేస్తుంది. దీనితో రవికృష్ణ హృదయం బద్దలవుతుంది. దీనితో వీరిద్దరి మధ్య బ్రేకప్ జరుగుతుంది. అయితే ఇదంతా ఈ షోలో భాగంగా చేసిన స్కిట్ అని అర్థం చేసుకోవచ్చు. ఇది ప్రోమో మాత్రమే. పూర్తి ఎపిసోడ్ ని జనవరి 29న టెలికాస్ట్ చేస్తారు. 

నాగార్జున హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ సీజన్ 3లో రవికృష్ణ కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. బిగ్ బాస్ తో రవికృష్ణ గుర్తింపు మరింతగా పెరిగింది. ఇప్పుడు నటుడిగా టివి సీరియల్స్ లో రాణిస్తున్నాడు. 

click me!