బిగ్ బాస్ బ్యూటీ రతికా రోజ్ స్టైలిష్ ఫోజులు చూశారా.. లేటెస్ట్ లుక్ వైరల్

First Published Apr 20, 2024, 4:55 PM IST

బిగ్ బాస్ సీజన్ 7 లో గ్లామరస్ కంటెస్టెంట్ గా రతిక చేసిన హంగామా అంతా ఇంతా కాదు. రతికా రోజ్, పల్లవి ప్రశాంత్ మధ్య లవ్ ట్రాక్ తెగ వైరల్ అయింది.

బిగ్ బాస్ సీజన్ 7 లో గ్లామరస్ కంటెస్టెంట్ గా రతిక చేసిన హంగామా అంతా ఇంతా కాదు. రతికా రోజ్, పల్లవి ప్రశాంత్ మధ్య లవ్ ట్రాక్ తెగ వైరల్ అయింది. జనాలు కొన్ని రోజుల పాటు వీరిద్దరి కెమిస్ట్రీ గురించే మాట్లాడుకున్నారు. 

మొదట్లో రతికా అగ్రెసివ్ గా బిహేవ్ చేసింది. ఆ అగ్రెసివ్ నెస్, దూకుడు స్వభావం అందరితో గొడవ పెట్టుకోవడం రతికకి మైనస్ గా మారింది. ఆమెకి పౌలారిటీ తెచ్చిన అంశం అంటే పల్లవి ప్రశాంత్ తో లవ్ ట్రాక్ నడపడమే. 

కొన్ని వారాలకు ఎలిమినేట్ అయిన రతిక ఆ తర్వాత వైల్డ్ కార్డు ద్వారా మరోసారి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ ఛాన్స్ ని కూడా రతిక సరిగా ఉపయోగించుకోలేదు. తీవ్రంగా ట్రోలింగ్ ఎదుర్కొంది. 

ఇదిలా ఉండగా రతికకి బిగ్ బాస్ పుణ్యమా అని కొన్ని చిత్రాల్లో ఆఫర్స్ కూడా వస్తున్నాయి. బాలయ్య భగవంత్ కేసరి చిత్రంలో రతిక మంత్రి పీఏ గా నటించింది. 

రతిక గ్లామర్ కి యువతలో చాలా మంది అభిమానులు ఉన్నారు. రతిక తరచుగా సోషల్ మీడియాలో తన గ్లామరస్ పిక్స్ షేర్ చేస్తుంటారు. తాజాగా రతిక బ్లూ డ్రెస్ లో అదిరిపోయే ఫోజులు ఇచ్చింది. 

రతికా యమా స్టైలిష్ గా గ్లాస్ పట్టుకుని డ్రింక్ ఎంజాయ్ చేస్తూ ఇస్తున్న ఫోజులు యువతని ఆకట్టుకుంటున్నాయి. రతికా కాస్త గట్టిగా ప్రయత్నిస్తే హీరోయిన్ గా కూడా ఛాన్స్ అందుకునే అవకాశం ఉందని అంటున్నారు. 

click me!