Bigg Boss Kannada 12: డిప్యూటీ సీఎం చొరవతో బిగ్ బాస్ కన్నడ హౌస్ డోర్లు తిరిగి ఓపెన్ అయ్యాయి. సీజ్ చేసిన బిగ్ బాస్ హౌస్ ని ఎందుకు మళ్ళీ ఓపెన్ చేశారో ఈ కథనంలో తెలుసుకోండి.
స్టార్ హీరో కిచ్చా సుదీప్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ కన్నడ సీజన్ 12 ఇటీవల మూత పడిన సంగతి తెలిసిందే. మంగళవారం రోజు కన్నడ బిగ్ బాస్ హౌస్ ని కాలుష్య నియంత్రణ మండలి సీజ్ చేసింది. కంటెస్టెంట్లు అందరినీ బయటకి పంపేశారు. ఇది పెద్ద గందరగోళానికి దారితీసింది. దీనితో బిగ్ బాస్ కన్నడ సీజన్ 12 ఉంటుందా ? పూర్తిగా రద్దవుతుందా అనే అనుమానాలు పెరిగాయి. కానీ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చొరవతో బిగ్ బాస్ హౌస్ డోర్లు మళ్ళీ తెరుచుకున్నాయి.
25
స్టూడియోపై ఆరోపణలు ఇవే
దీనితో బిగ్ బాస్ కన్నడ షో షూటింగ్ తిరిగి ప్రారంభం అయింది. బిగ్ బాస్ హౌస్ ని సీజ్ చేయడం వెనుక బలమైన కారణం ఉంది. బిడదిలోని అమ్యూజ్మెంట్ పార్క్ జాలీవుడ్ స్టూడియోలో బిగ్ బాస్ కన్నడ షూటింగ్ జరుగుతోంది. బిగ్ బాస్ హౌస్ ని అక్కడే నిర్మించారు. ఆ స్టూడియో నుంచి నిత్యం 2.5 లక్షల లీటర్ల కలుషితమైన నీరు బయటకి వస్తోందని ఆరోపణలు ఉన్నాయి.
35
బిగ్ బాస్ హౌస్ సీజ్
కాలుష్య నియంత్రణ మండలి ఎన్నిసార్లు నోటీసులు పంపినా స్టూడియో నిర్వాహకులు పట్టించుకోలేదు. దీనితో మంగళవారం రోజు తహసీల్దారు తేజస్విని ఇతర అధికారులతో కలిసి బిగ్ బాస్ హౌస్ ని సీజ్ చేశారు. దీనితో కిచ్చా సుదీప్ హోస్ట్ గా చేస్తున్న షో మధ్యలోనే ఆగిపోయింది.
అయితే ఈ వివాదంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ జోక్యం చేసుకోవడం బిగ్ బాస్ డోర్లు ఓపెన్ అయ్యాయి. పర్యావరణానికి ప్రాధాన్యత ఇస్తూనే వినోద రంగానికి కూడా మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో డీకే శివకుమార్ బిగ్ బాస్ డోర్లు ఓపెన్ చేయించారు.
55
కృతజ్ఞతలు తెలిపిన కిచ్చా సుదీప్
జాలీవుడ్ స్టూడియోకి కలుషిత నీరు విషయంలో చివరి అవకాశం ఇవ్వాలని డీకే శివకుమార్ సౌత్ డిస్ట్రిక్ట్ డిప్యూటీ కమిషనర్ ని ఆదేశించారు. ఇకపై కూడా స్టూడియో వారు కాలుష్య నియంత్రణ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. బిగ్ బాస్ తిరిగి ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకున్న డిప్యూటీ సీఎం శివకుమార్ కి కిచ్చా సుదీప్ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. బిగ్ బాస్ కన్నడ అభిమానులు డిప్యూటీ సీఎంని ప్రశంసిస్తున్నారు. దటీజ్ డిప్యూటీ సీఎం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.