బిగ్ బాస్ ప్రేమకథలు... ఒకటి సఫలం మరొకటి విఫలం!

First Published Feb 20, 2021, 7:07 PM IST

బిగ్ బాస్ హౌస్ లో ప్రేమ కథలు సర్వ సాధారణం. తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోలో మాత్రం ఈ సాంప్రదాయం రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి ప్రారంభించారు. ఇక లేటెస్ట్ సీజన్లో అఖిల్-మోనాల్, అభిజిత్-హారిక ప్రేమ జంటలుగా ప్రాచుర్యం పొందారు. 
 

అయితే ఈ రెండు జంటలలో ఒక జంట ఇప్పటికీ తమ ప్రేమను కొనసాగిస్తూ.. తమది రియల్ లవ్ అని నిరూపించగా, మరో జంట తమది షో కోసం మాత్రమే నడిపిన ప్రేమాయణం అని నిరూపించారు.
undefined
బిగ్ బాస్ సీజన్ 4 లో యంగ్ మేల్ కంటెస్టెంట్స్ ని ఆకర్షించి అమ్మాయి మోనాల్ గజ్జర్. హైట్ అండ్ వెయిట్ తో ఆకర్షించే అందం ఉన్న నార్త్ బ్యూటీకి చాలా మంది పడిపోయారు. ఆ లిస్ట్ లో అభిజిత్ కూడా ఉన్నాడు.
undefined
మొదట్లో మోనాల్ కోసం అభిజీత్ గట్టిగా ట్రై చేశాడు. ఉన్నవాళ్లందరిలో అన్నివిధాలా నేనే టాప్ అనుకునే అభిజీత్ సైతం, మోనాల్ తనకే కనెక్ట్ అవుతుంది అనుకున్నాడు. అనూహ్యంగా మోనాల్ దృష్టి మాత్రం అఖిల్ పై పడింది.
undefined
అలా అఖిల్- మోనాల్ లవర్స్ అయిపోయారు. తమ ప్రేమ అందరికీ తెలిసేలా ఒకే రంగు దుస్తులు వేసుకోవడం, కోపాలు, తాపాలు, అలకలు వంటి లవ్ ఎమోషన్స్ అన్నీ చూపించేవారు. అయితే అవన్నీ షో కోసం వాళ్ళ ట్రిక్స్ అనుకున్న వాళ్లకు, తమ అభిప్రాయం తప్పు అనేలా మోనాల్, అఖిల్ ప్రస్తుతం బంధం కొనసాగిస్తున్నారు.
undefined
అఖిల్ కెరీర్ కోసం మోనాల్ ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం దీనికి నిదర్శనం. అఖిల్ నా ఫ్యామిలీ మెంబర్ అని హౌస్ లో చెప్పిన మోనాల్, అది తన మనసులో ఉన్న రియల్ ఫీలింగ్ అని నిరూపిస్తుంది.
undefined
మరో జంట అభిజిత్- హారిక మాత్రం దీనికి భిన్నంగా  ఎవరి దారి వారిదే అన్నట్లు ఉంటున్నారు. హౌస్ లో లవ్ బర్డ్స్ లా మెలిగిన ఈ జంట కనీసం అప్పుడప్పుడు కూడా కలవడం లేదు.
undefined
హౌస్ లో ఉన్న సమయంలో అభిజిత్-హారిక ఫ్యాన్స్ అభిక అనే ఓ యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. వీరిద్దరి పేరెంట్స్ కలిసి ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. హారిక మా కోడలిగా ఇష్టమే అంటూ.. అభిజిత్ తల్లి చెప్పారు.
undefined
బిగ్ బాస్ టైటిల్ గెలుచుకున్న అభిజీత్ మాత్రం బయటికి వచ్చాక, హారిక తనకు సిస్టర్ లాంటిదని చెప్పి షాక్ ఇచ్చాడు. ఆ కామెంట్ హారికను కూడా బాధించినట్లు సమాచారం. అందుకే వీరిద్దరి మధ్య కనీసం హాయ్, బై అనుకునే సఖ్యత కూడా లేదట.
undefined
అలా బిగ్ బాస్ హౌస్ లో చిగురించిన ప్రేమ కథలు ప్రస్తుతం ఉన్నాయి. నిజంగా మోనాల్-అఖిల్ ఒకరికి మరొకరు మద్దతు తెలుపుకుంటూ అప్పటి రిలేషన్ కొనసాగిస్తున్నారు.
undefined
click me!