ట్రెండీ వేర్ లో బిగ్ బాస్ బ్యూటీ వీకెండ్ ట్రీట్.. ఖతర్నాక్ ఫోజులిస్తూ హారిక గ్లామర్ మెరుపులు..

First Published | Jun 24, 2023, 5:12 PM IST

‘బిగ్ బాస్’ ఫేమ్ హారిక (Bigg Boss Harika)  స్టన్నింగ్ స్టిల్స్ తో కట్టిపడేస్తోంది. వీకెండ్ ట్రీట్ గా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. బ్యూటీఫుల్ లుక్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 
 

యూట్యూబ్ సెన్సేషన్ దేత్తడి హారిక ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటికి వచ్చాక ఈ బ్యూటీ క్రేజ్ మరింతగా పెరగడంతో నెట్టింట వరుసగా పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది. 
 

తొలుత ‘దేత్తడి’ ఛానెల్ తో యూట్యూబ్ లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తెలంగాణ యాస, భాషలో ఆకట్టుకుంది. ఊరమాస్ అటిట్యూడ్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ తెలుగులో అవకాశం దక్కించుకుంది.


సీజన్ 4తో బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ అవకాశంతో బుల్లితెర ప్రేక్షకులకు కూడా హారిక మరింతగా దగ్గరైంది. హౌజ్ లోనూ హారిక తోటి కంటెస్టెంట్లకు గట్టి పోటీని ఇచ్చింది. ప్రతి టాస్క్ లోనూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి ప్రేక్షకులను అలరించింది.
 

అయితే, హౌజ్ నుంచి బయటకు వచ్చాక మాత్రం ఆ క్రేజ్ ను సరైన విధంగా వినియోగించడం లేదని అంటున్నారు. గతంలోనే ఈమెకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. కానీ అప్పుడు కావాలనే వద్దనుకుంది. ప్రస్తుతం మాత్రం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. 

ప్రస్తుతానికి నెట్టింట బ్యాక్ టు బ్యాక్ పోస్టులతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ సందర్భంగా అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది. మరోవైపు గ్లామర్ మెరుపులతోనూ మైమరిపిస్తోంది. లేటెస్ట్ గా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్  స్టన్నింగ్ గా ఉన్నాయి. 

ట్రెండీ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. నడుము దగ్గర గ్యాప్ ఇచ్చి  స్లీవ్ లెస్ టాప్, లూస్ ట్రౌజర్ ధరించింది. కిర్రాక్ ఫోజులతో చూపుతిప్పుకోకుండా చేసింది. మత్తుకళ్లతో మంత్రముగ్ధులను చేసేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక హారిక నటించిన ‘వెళ్లకే’ అనే మ్యూజిక్ వీడియోకు మంచి రెస్పాన్స్ దక్కుతోంది.
 

Latest Videos

click me!