
`అతడు`, `ఖలేఖా` తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో `గుంటూరు కారం` చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో మెయిన్ హీరోయిన్‌గా పూజా హెగ్డేని ఎంపిక చేశారు. సెకండ్ లీడ్‌గా శ్రీలీలని అనుకున్నారు. కొంత పార్ట్ షూటింగ్ కూడా జరిగింది. కానీ అనేక కారణాలతో ఈ సినిమా డిలే అవుతూ వస్తోంది. షూటింగ్ వాయిదాలు పడుతూ వస్తోంది. మొదట సూపర్ స్టార్ కృష్ణచనిపోవడంతో షూటింగ్ వాయిదా వేశారు. ఆ తర్వాత యాక్షన్ ఎపిసోడ్ల విషయంలో నచ్చక వాయిదా వేసినట్టు తెలిసింది. ఫైట్ మాస్టర్లని మారుస్తున్నట్టు వార్తలొచ్చాయి.
ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మారిపోతున్నారని, ఆయన స్థానంలో దేవిశ్రీ ప్రసాద్‌ని తీసుకుంటున్నారని అన్నారు. కానీ అందులో నిజం లేదని థమన్ పరోక్షంగా హింట్ ఇచ్చారు. నిర్మాత కూడా రియాక్ట్ అయ్యారు. ఆర్టిస్టుల డేట్స్ సెట్ కాక వాయిదా పడుతుందని అన్నారు. అనేక అడ్డంకులు దాటుకుని `గుంటూరు కారం` నేటి నుంచి రెగ్యూలర్ షూటింగ్‌ని ప్రారంభించారు. దాదాపు మూడు నాలుగు నెలలపాటు కంటిన్యూగా షూటింగ్ చేయబోతున్నారట. మహేష్ బర్త్ డే కూడా గ్యాప్ లేకుండా చిత్రీకరణ జరుపబోతున్నట్టు సమాచారం.
ఇదిలా ఉంటే పూజా హెగ్డే ఈ సినిమా నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. డేట్స్ అడ్జెస్ట్ కాక తప్పుకుందని అన్నారు. కానీ డైరెక్టర్‌తో ఏర్పడిని బేధాభిప్రాయాల కారణంగానే పూజా తప్పుకుందట. తన పాత్రకి పెద్దగా ప్రయారిటీ ఇవ్వకపోవడంతో ఆమె హర్ట్ అయ్యిందని సమాచారం. అందుకే ఈ సినిమా నుంచి వైదొలిగిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో పూజా స్థానంలో ఎవరు వస్తారనే చర్చ మొదటైంది. ఇందులో రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి.
ప్రధానంగా సంయుక్త మీనన్‌ని తీసుకుంటున్నారనే టాక్ వినిపించింది. ఈ హీరోయిన్‌ని దర్శకుడు త్రివిక్రమ్ ఎంకరేజ్ చేస్తున్న నేపథ్యంలో ఆమెనే మెయిన్ హీరోయిన్‌గా తీసుకోవాలనుకుంటున్నారనే టాక్ వచ్చింది. కానీ తాజాగా మరో కొత్త హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. `హిట్2` భామ మీనాక్షి చౌదరిని ఎంపిక చేశారట. ఆల్మోస్ట్ ఈ పొడుగు కాళ్ల సుందని ఫైనల్ చేశారని సమాచారం. మహేష్‌కి పర్‌ఫెక్ట్ గా సెట్ అవుతుందని టీమ్ భావించి ఓకే చేశారని టాక్. దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు.
ఇదిలా ఉంటే పూజా వెళ్లిపోవడంతో హీరోయిన్ల పాత్రలు తార్ మార్ తక్కర్ మార్ అనేలా మారిపోయిందట. పూజా స్థానంలోకి మెయిన్ హీరోయిన్‌గా శ్రీలీలని తీసుకుంటున్నారట. శ్రీలీల పాత్రలో మీనాక్షి నటిస్తుందని సమాచారం. ఈ రకంగా శ్రీలీలకి సెకండ్ హీరోయిన్ నుంచి మెయిన్ హీరోయిన్‌గా ప్రమోషన్ వచ్చిందని చెప్పొచ్చు. మరి దీనిపై కూడా స్పష్ట రావాల్సి ఉంది. కానీ ఈ వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి.
ఇక హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ(చినబాబు) నిర్మిస్తున్న ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి జనవరి 13న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. రిలీజ్ డేట్‌లో మార్పు ఉండదని తెలుస్తుంది. ఇందులో మహేష్ మాస్ లుక్‌లో కనిపించబోతున్నారు. ఆయన పాత్ర ఊర మాస్‌గా ఉంటుందని సమాచారం. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. సినిమా స్టయిల్‌ని, మహేష్ పాత్ర ఎలా ఉండబోతుందనే క్లారిటీ ఇచ్చింది. ఇది సినిమాపై అంచనాలను పెంచుతుంది.