‘బిగ్ బాస్’తో ఫేమ్ సంపాదించుకున్న తెలంగాణ పిల్ల దేత్తడి హారిక ఆయా ఈవెంట్లకు హాజరవుతూ సందడి చేస్తోంది. తాజాగా ఓ జ్యూయెల్లరీ స్టోర్ లో ట్రెడిషనల్ లుక్ లో కనువిందు చేసింది. లేటెస్ట్ స్టిల్స్ ఆకట్టుకుంటున్నాయి.
యూట్యూబ్ సెన్సేషన్ దేత్తడి హారిక (Dethadi Harika) క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. కామెడీ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్ తో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అదే క్రేజ్ తో బుల్లితెరపైన అలరించింది.
26
‘దేత్తడి’ యూట్యూబ్ ఛానెల్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన హారిక.. అదే క్రేజ్ తో ‘బిగ్ బాస్ తెలుగు’లో అవకాశం దక్కించుకుంది. సీజన్ 4తో హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తనదైన శైలిలో ఆడియెన్స్ ను అలరించింది.
36
‘బిగ్ బాస్’ షోతో టీవీ ఆడియెన్స్ కు దగ్గరైన ఈ బ్యూటీ హౌజ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. అయితే, షోతో వచ్చిన క్రేజ్ తో హారికకు బుల్లితెరపై మరింత సందడి చేస్తుందని ఆశించినప్పటికీ.. మళ్లీ యూట్యూబ్, సోషల్ మీడియాకే పరితమైంది.
46
ప్రస్తుతం ఆయా ఈవెంట్లకు, మాల్స్ ఓపెనింగ్ కు హాజరవుతూ సందడి చేస్తోంది. తాజాగా ‘జీఆర్టీ జ్యూయెలర్స్’లో కనువిందు చేసింది. స్టోర్ లోని అభరణాలు, వెండి, బంగారు వస్తువులను, డివోషనల్ సెట్స్ ను, డిఫరెంట్ డిజైనింగ్స్ ను పరిచయం చేస్తూ ఓ వీడియోను వదిలింది.
56
ఈ సందర్భంగా లైట్ గ్రీన్ లెహంగా వోణీలో హారిక ఆకట్టుకుంది. ట్రెడిషనల్ లుక్ లో కవ్వించేలా ఫొటోలకు పోజులిస్తూ మతులు పోగొట్టింది. మత్తు కళ్లతో కుర్ర గుండెల్ని కొల్లగొట్టింది. యంగ్ బ్యూటీ గ్లామర్ విందుకు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ ను వైరల్ చేస్తున్నారు.
66
బిగ్ బాస్ ఫేమ్ తో హారికకు బుల్లితెరపై సరైన అవకాశాలు వస్తాయని అంతా భావించారు. కానీ, హారిక ముందుకెళ్లేందుకు ఈ క్రేజ్ సరిపోయేలా లేదు. దీంతో ఈ బ్యూటీ కూడా సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా ఉంటూ.. ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకునే పనిలో నిమగ్నమైంది.