Bigg Boss Telugu 6: టైటిల్ కోసం అమ్మాయిల్ని నేను పొగడలేదు... బయటకు రాగానే శ్రీహాన్ ని టార్గెట్ చేసిన రేవంత్ 

Published : Dec 19, 2022, 02:51 PM ISTUpdated : Dec 19, 2022, 03:07 PM IST

బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్ విన్నర్ గా రేవంత్ అవతరించాడు. అయితే ఇది సంతృప్తికరమైన విజయం కాదు. జనాలు శ్రీహాన్ కి ఓటేసి గెలిపోయించారని నాగ్ చెప్పడంతో రేవంత్ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అయ్యింది.   

PREV
18
Bigg Boss Telugu 6:  టైటిల్ కోసం అమ్మాయిల్ని నేను పొగడలేదు... బయటకు రాగానే శ్రీహాన్ ని టార్గెట్ చేసిన రేవంత్ 
Bigg Boss Telugu 6

గత ఐదు సీజన్స్ లో ఎన్నడూ చూడని ఫినాలే సీజన్ 6 (Bigg Boss Telugu 6 Grand Finale) లో చోటు చేసుకుంది. రేవంత్ టైటిల్ విన్నర్ అయినప్పటికీ అందులో శ్రీహాన్ కి కూడా భాగం ఉన్నట్లయ్యింది. హౌస్లో నేను తోపు, నాకు సాటి ఎవడూ లేడని విర్రవీగిన రేవంత్ కి చావు దెబ్బ తగిలింది. నలభై లక్షలు తీసుకొని శ్రీహాన్ తప్పుకోవడంతో రేవంత్ విన్నర్ అయ్యాడు. కానీ ఆడియన్స్ ఓట్లతో గెలిచింది మాత్రం శ్రీహాన్. 
 

28
Bigg Boss Telugu 6


రేవంత్ టైటిల్ గెలిచి కూడా ఆస్వాదించలేని పరిస్థితి ఏర్పడింది. శ్రీహాన్(Sreehan) సైతం సంతోషంగా లేడు. అనవసరంగా టెంప్ట్ అయ్యి... పెద్ద మొత్తంలో గెలుచుకునే అవకాశం కోల్పోయాడు. నాగార్జున ఆఫర్ ని శ్రీహాన్ అంగీకరించకుండా ఉండి ఉంటే... దాదాపు రూ. 85 లక్షల విలువైన బహుమతులు సొంతం అయ్యేవి. అలా విన్నర్, రన్నర్ ఇద్దరి సంతోషం ఆవిరైంది. 
 

38
Bigg Boss Telugu 6

 కాగా రేవంత్ (Revanth)అహం బాగా దెబ్బతింది. హౌస్ నుండి బయటకు వచ్చాక ఆయన మాటలు వింటే ఈ విషయం అర్థం అవుతుంది . శ్రీహాన్ తప్పుకోవడం వలన విన్నర్ అయ్యాడనే నిజాన్ని అతడు ఒప్పుకోలేకున్నాడు. అందుకే తనని తాను డిపెండ్ చేసుకోవాలి అనుకుంటున్నాడు. అందుకు రేవంత్ తాజా కామెంట్స్ ఉదాహరణ. యాంకర్ శివతో బిబి కెఫే లో పాల్గొన్న రేవంత్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన పరోక్షంగా శ్రీహాన్ ని టార్గెట్ చేశారు అనిపిస్తుంది. 
 

48
Bigg Boss Telugu 6


 రేవంత్ మాట్లాడుతూ... ఏం జరిగింది, ఎలా వచ్చింది అనేది నా దృష్టిలో మేటర్ కాదు, నేను టైటిల్ గెలవాలి అనుకున్నాను గెలిచాను. కోల్పోయిన డబ్బులు గురించి చెప్పాలంటే... పేరు సంపాదిస్తే డబ్బు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. విన్నర్ గా రావాల్సిన రూ. 50 లక్షలు పూర్తిగా దక్కలేదని బాధపడను అని రేవంత్ ఇండైరెక్ట్ గా చెప్పాడు. 
 

58
Bigg Boss Telugu 6


 అదే సమయంలో శ్రీహాన్ నాగార్జున ఆఫర్ తీసుకోవడం వలన తాను విన్నర్ అయ్యాడనేది నమ్మను, పట్టించుకోను. గెలవాలి అనుకున్న టైటిల్ ఎలాగైనా సొంత చేసుకున్నానని అతడు పరోక్షంగా చెప్పాడు. ఇంకా మాట్లాడుతూ...  ఈ 105 రోజుల్లో నేను ఎలా ఉంటానో అలానే ఉన్నాను, క్యారెక్టర్ మార్చుకోలేదు. కోపం వస్తే కోపం, ప్రేమ వస్తే ప్రేమ చూపించాను, అన్నాడు.  

68
Bigg Boss Telugu 6


జనం కోసం ఒక అమ్మాయిని పొగడాలి, ఆ అమ్మాయి వైపు స్టాండ్ తీసుకోవాలనేవి ఏనాడూ చేయలేదు. నేను ఎలా ఉన్నానో అలా ఉన్నా కాబట్టి ఇక్కడ వరకు వచ్చాననే నమ్మకం నాకుంది, అన్నాడు. ఈ మాటలు ఖచ్చితంగా శ్రీహాన్ ని టార్గెట్ చేస్తూ అన్నవే. జనాల ఓట్ల కోసం శ్రీహాన్ శ్రీసత్యకు దగ్గరయ్యాడు, ఆమెకు అండగా ఉన్నట్లు నటించి ఆడియన్స్ ఓట్లు పొందాడని రేవంత్ చెప్పినట్లుంది. 

78
Bigg Boss Telugu 6


నమ్మిన వాళ్ళు, నా అనుకున్న వాళ్ళు కూడా మిగతా వాళ్ళతో చేరి కామెంట్స్ చేసినప్పుడు బాధేసింది. మిగతా కంటెస్టెంట్స్ అందరూ తమ పాజిటివ్స్ ఎలివేట్ చేసుకున్నారు. నేను నా నెగిటివ్స్ ని పాజిటివ్ గా మలచుకొని విన్నర్ అయ్యానని రేవంత్ చెప్పింది శ్రీహాన్ గురించే. కారణం...శ్రీసత్య,శ్రీహాన్  తన బెస్ట్ ఫ్రెండ్స్ గా హౌస్లో రేవంత్ ప్రొజెక్ట్ చేశాడు. నమ్మినవాళ్లు అంటే ఇక్కడ ఆ ఇద్దరే అనేది సుస్పష్టం. 
 

88
Bigg Boss Telugu 6

మొత్తంగా టైటిల్ అందుకున్నప్పటికీ రేవంత్ లో సంతోషం లేదు. శ్రీహాన్ పై అతడు అక్కసుతో ఉన్నాడని క్లియర్ గా తెలుస్తుంది. శ్రీహాన్ రియల్ విన్నర్ అనే నిజాన్ని ఒప్పుకోలేక ఏవేవో మాట్లాడుతున్నారు. అయితే వీరిద్దరిపై కూడా జనాల్లో పెద్ద ఎత్తున నెగిటివిటీ ఉంది. లక్షలు ఖర్చుపెట్టి పీఆర్స్ సహాయంతో ఫైనల్ కి వచ్చారు, రియల్ విన్నర్స్ ఆదిరెడ్డి, రోహిత్, కీర్తి అంటున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories