చీరకట్టులో ‘బిగ్ బాస్’హారిక అందాలు అదుర్స్.. చిరంజీవి సినిమా పాటేసుకుంటున్న నెటిజన్లు!

First Published | Feb 23, 2023, 12:39 PM IST

‘బిగ్ బాస్’ఫేమ్ అలేఖ్య హారిక స్టన్నింగ్ ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది. చీరకట్టులో అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. తాజాగా పంచుకున్న ఫొటోలు వైరల్ గా మారుతున్నాయి. 
 

అలేఖ్య హారిక యూట్యూబర్ గా ఎంతటి సెన్సేషన్  క్రియేట్ చేసిందో తెలిసిన విషయమే. తెలంగాణ భాష, యాసలో అనర్గళంగా మాట్లాడగల ఈ బ్యూటీ.. యూట్యూబ్ వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా యూత్ లో మంచి క్రేజ్ దక్కించుకుంది. 
 

దేత్తడి హారిక (Dethadi Harika)గా యూట్యూబ్ యూజర్లకు, తెలుగు ఆడియెన్స్ కు బాగా పరిచయం అయ్యింది. తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ ను దక్కించుకుంది. దీంతో నేరుగా పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు’ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 
 


సీజన్ 4తో హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ టీవీ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది. హౌజ్ లోని ప్రతి టాస్క్ లో యాక్టివ్ గా పార్టిసీపేట్ చేసి యూత్ ను ఆకట్టుకుంది.. హౌజ్ నుంచి బయటికి వచ్చాక ఈ బ్యూటీ మరింత ఫేమ్ దక్కించుకుంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఈ సందర్భంగా క్రేజీ పోస్టులు పెడుతూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మరోవైపు అదిరిపోయేలా ఫొటోషూట్లు కూడా చేస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది. తాజాగా చీరకట్టులో మెరిసింది.  

స్లీవ్ లెస్ బ్లౌజ్, చీరకట్టులో దర్శనమిచ్చి గ్లామర్ విందు చేసింది. నడుము అందాలతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేసింది. మత్తెక్కించే పోజులతో నెట్టింట దుమారం రేపింది. ఫొటోలు పంచుకుంటూ ‘ఏ సాంగ్ బాగా సూట్ అవుతుంది?’ అంటూ ఫ్యాన్స్ ను  అభిప్రాయాన్ని  కోరింది. 

దీంతో అభిమానులతో పాటు నెటిజన్లు కూడా హారిక అందాన్ని పొగుడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘అంజి’ చిత్రంలోని ‘అబ్బో నీయమ్మ గొప్పదే.. అందం పోగేసి కన్నదే’ సాంగ్ హారిక బ్యూటీని పోల్చేందుకు సరిపోతుందని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ‘బర్సోరే మేఘా’ ఆయా సాంగ్స్ ను చెబుతున్నారు. హారిక ప్రస్తుతం ఇలా సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఆకట్టుకుంటున్నారు. 

Latest Videos

click me!