ఇక మిగిలిన సభ్యుల్లో గ్లామ్ హోటల్లో ఐదు అమ్మాయిలు పనిచేస్తుంటారు. వారిలో ఫైమా మేనేజర్ కాగా, శ్రీసత్య, ఆరోహి, కీర్తి, వసంతి సర్వెంట్లు. ఇక బీబీ హోటల్లో సుదీప మేనేజర్ కాగా, రేవంత్, బాలాదిత్య, గీతూ, మరీనా సర్వెంట్లు. ఇనయ రాజకుటుంబంలో పుట్టిన ఒంటరి అమ్మాయి. రోహిత్ భార్య పారిపోవడంతో ఆమె కోసం వెతుక్కుంటూ వచ్చిన అతిథి, శ్రీహాన్ హీరో, పేరు కోసం ప్రయత్నిస్తుంటారు. సూర్య మతిస్థితిమితం సరిగా లేదని వ్యక్తి. ఆది ఫుడ్ రివ్యూవర్. రాజ్, అర్జున్ తీయబోయే సినిమా కోసం లోకేషన్ చూడ్డానికి వచ్చిన వారు. ఈ టాస్క్ లో గెస్ట్ లు సర్వెంట్ల చేత పనిచేయించుకుని డబ్బులివ్వాలి, హోటల్ స్టాఫ్ పనిచేసి, ఫుడ్ పెట్టి గెస్ట్ ల నుంచి డబ్బులు పొందాలి. ఎక్కువ డబ్బులు ఉన్న వారి కెప్టెన్ కి పోటీదారులవుతారు.