కన్న తండ్రే అలాంటి ముద్ర వేశాడు.. ఉర్ఫీ జీవితంలో ఇన్ని కష్టాలా.. ‘బిగ్ బాస్’బ్యూటీ షాకింగ్ కామెంట్స్

First Published | Apr 9, 2023, 5:44 PM IST

యంగ్ అండ్ బోల్డ్ బ్యూటీ ఉర్ఫీ జావెద్ (Urfi Javed) తాజాగా తన జీవితంలోని కొన్ని చేధు అనుభవాలను గుర్తు చేసుకుంది. తాను ఎదుర్కొన్న సమస్యలను చెబుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. 
 

‘బిగ్ బాస్’ ఫేమ్ ఉర్ఫీ జావెద్ సోషల్ మీడియాలో చేసే రచ్చ ద్వారా అందరికీ పరిచయమే. ఆమె ధరించే దుస్తులు ఎంత షాకింగ్ గా ఉంటాయో చెప్పనక్కర్లేదు. బోల్డ్ లుక్స్ లో ఫొటోషూట్లు చేస్తూ.. విభిన్న వస్త్రాదరణతో దుమారం రేపుతుంటుంది. తను ధరించే దుస్తులతో ఎక్కువగా విమర్శలకు కూడా గురవుతూ ఉంటుంది.
 

హిందీ సిరియల్స్ ద్వారా టీవీ ప్రేక్షకుల్లో నటిగా గుర్తింపు తెచ్చుకుంది ఉర్ఫీ జావేద్. ‘బడే బయ్యా కీ దుల్హానియా, చంద్ర నంది, మేరీ దుర్గా, బే పన్నాహ, జీజీ మా, హే రిస్తా క్యా ఖేల్తా హే వంటి సీరిస్ ల ద్వారా ఆకట్టుకుంటుంది. 2021లో కరణ్ జోహార్ హోస్ట్ గా నిర్వహించిన ‘బిగ్ బాస్ ఓటీటీ’ కాంటెస్టెంట్ గానూ అలరించింది. 
 


యూపీకి చెందిన ఈ బోల్డ్ భామ తన  డ్రెస్సింగ్ ద్వారా ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే మారుతుంటుంది. మరోవైపు స్కిన్ షోతో మంటలు రేపుతుంటుంది. బోల్డ్ లుక్స్ లో, సెమీ న్యూడ్ గా దర్శనమిస్తూ మైండ్ బ్లాక్ చేస్తుంటుంది. ఇదిలా ఉంటే.. ఆమె జీవితంలో జరిగిన కొన్ని చేధు అనుభవాలను ఉర్ఫీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకోవడం వైరల్ గా మారింది.

తన కుటుంబ సభ్యులే తనను ద్వేషించారని చెప్పుకొచ్చింది. గతంలో ఓ ట్యూబ్ ను టాప్ గా ధరించి, ఫేస్ బుక్ లో అపోల్ చేశానంది. ఆ ఫొటోను కొందరు అడల్డ్ సైట్లలో పెట్టారని చెప్పింది. అది తనేనని గుర్తించిన చాలా మంది తనను అడల్ట్ స్టార్ అని పిలిచారంటూ ఆవేదన చెందింది. అలా అన్న ప్రతిసారీ నా వీడియో ఏదంటూ ప్రశ్నించానని చెప్పుకొచ్చింది.
 

అయితే, తన తండ్రి కూడా తనను అడల్ట్ స్టార్ అంటూ ముద్రవేయడం బాధగా ఉందంది. పైగా అడల్ట్ సైట్ వాళ్లే మమల్ని రూ.50 లక్షలు అడుగుతున్నారని అందరికీ ప్రచారం చేసేవాడంట. దాంతో బందువులు, తెలిసిన వాళ్లందరూ దారుణమైన మాటలు అనేవారని చెప్పుకొచ్చింది.  కొన్ని సార్లు తనను కొట్టారని కూడా చెప్పింది.
 

దాంతో 17 ఏండ్ల వయస్సులోనే తన చెల్లెళ్లలను తీసుకొని పోలీసులను ఆశ్రించానని చెప్పింది. అక్కడా ఫలితం లేకపోవడంతో లక్నోకు వెళ్లి ఎన్నో కష్టాలు పడ్డట్టు వివరించింది. కిందామీద పడి ఈస్థాయికి చేరుకున్నట్టు తెలిపింది. ఏదేమైనా ఉర్ఫీకి చిన్నవయస్సులో అవమానాలు, భాదలు రావడం బాధాకరం. ఇక ఈయంగ్ బ్యూటీ రీసెంట్ గా స్ల్పిట్స్ విల్లా రియాలిటీ షోలో మెరిసింది.

Latest Videos

click me!