రాముడు అయోధ్యలోనే ఉంటాడా? కరోనా కంటే దారుణమైనవి వస్తాయి... శివాజీ వివాదాస్పద కామెంట్స్ 

Published : Jan 18, 2024, 07:30 AM IST

ఫైర్ బ్రాండ్ శివాజీ మరోసారి రెచ్చిపోయారు. ఏకంగా అయోధ్య రామ మందిరాన్ని ఉద్దేశిస్తూ కీలక ఆరోపణలు చేశాడు. శివాజీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.   

PREV
17
రాముడు అయోధ్యలోనే ఉంటాడా? కరోనా కంటే దారుణమైనవి వస్తాయి... శివాజీ వివాదాస్పద కామెంట్స్ 
Sivaji


నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ శివాజీ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. బిగ్ బాస్ షోతో మరలా వెలుగులోకి వచ్చిన శివాజీ పలు విషయాల మీద స్పందిస్తున్నారు. హౌస్ నుండి బయటకు వచ్చాక కూడా జనాలకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నాడు. బీజేపీ పాలిటిక్స్ ని విమర్శించే క్రమంలో ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

 

27
ayodhya ram mandir

అయోధ్యలో రామ మందిరం నిర్మాణం పూర్తి అయ్యింది. జనవరి 22న ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగనుంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానం దక్కింది. అయితే ఎన్నికల వేళ రామ మందిర ప్రారంభోత్సవం రాజకీయ ప్రయోజనాల కోసమే అనే వాదన ఉంది. 

37
Sivaji

ప్రజల మత విశ్వాసాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి బీజేపీ ప్రభుత్వం రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టింది. దానికి దేశవ్యాప్తంగా ప్రచారం కల్పిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. శివాజీ సైతం ఇదే అంశం లేవనెత్తాడు. 

 

47

అయోధ్యలో ఉన్నదే రామ మందిరమా? అక్కడే రాముడు ఉంటాడా? మా ఊళ్ళో కూడా రామాలయం ఉంది. బ్రహ్మాండంగా ఉంటుంది. భారతీయ జీవన విధానమే రామ తత్త్వం. ఈ రాజకీయ పార్టీలు తమ అవసరాలు, అవకాశాల కోసం ఇలాంటి విషయాలు వాడుకుంటాయి. 
 

57

అయితే మనుషుల కంటే ప్రకృతి గొప్పది. అది దూల తీర్చేస్తుంది. మనుషుల వల్ల కాని మార్పు అది తీసుకు వస్తుంది. తప్పులు సరిద్దిదుతుంది. కరోనా వచ్చినప్పుడు అందరూ భయపడి చచ్చారు. కరోనా కంటే దారుణమైనవి వస్తాయి. ఎందుకంటే మనుషుల్లో క్రూరత్వం పెరిగిపోయింది. డబ్బే ప్రధానం అనుకుంటున్నారు. 

 

67

అప్పుడు దేవుడు వస్తాడు. సరిదిద్ది పోతాడు. మనుషులు చేసే తప్పులను ప్రకృతి బ్యాలన్స్ చేస్తుందని... చెప్పుకొచ్చాడు. శివాజీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 
 

77
shivaji

బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్న శివాజీ 3వ స్థానంలో నిలిచాడు. అయితే 12వ వారం తర్వాత తనను విలన్ చేసి చూపారని శివాజీ ఆరోపణలు చేశాడు. అదే సమయంలో అమర్ దీప్  ని ఆకాశానికి ఎత్తారని పరోక్షంగా మండిపడ్డాడు. నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చిన శివాజీ వరుస ప్రాజెక్ట్స్ ప్రకటిస్తున్నాడు.

click me!

Recommended Stories