అందాల జాతర చేసిన ‘బిగ్ బాస్’ సిరి.. ఇలా చూస్తే శ్రీహాన్ ఏమైపోతాడో అంటున్న ఫ్యాన్స్.. బ్యూటీఫుల్ పిక్స్

First Published | Jul 25, 2023, 6:12 PM IST

‘బిగ్ బాస్’ ఫేమ్ సిరి హన్మంత్ (siri Hanmanth)   అందాల జాతరతో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. తాజాగా యంగ్ బ్యూటీ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. మత్తుఫోజులతో మంత్రముగ్ధులను చేసింది. 
 

యూట్యూబ్ లో సందడి చేసిన యంగ్ బ్యూటీ సిరి హన్మంతు ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 5తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సీజన్ లో తోటి కంటెస్టెంట్లకు గట్టి పోటీనిచ్చింది. అలాగే ప్రతి టాస్క్ లో యాక్టివ్ గా ఉంటూ టీవీ ఆడియెన్స్ ను అలరించింది. 
 

సిరి హన్మంతుకు ‘బిగ్ బాస్’ మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ క్రేజ్ ను ఉపయోగించి తన కెరీర్ ను బిల్డ్ చేసుకోవాలని చూస్తోంది. ఈ సందర్భంగా టీవీ షోల్లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. 
 


ప్రస్తుతం కొన్ని టీవీ షోలకు యాంకర్ గానూ వ్యవహరిస్తూ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా సోషల్ మీడయాలోనూ సిరి హన్మంతు మంచి క్రేజ్ దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో అదరగొడుతోంది. 

ఇందుకు గాను అదిరిపోయే అవుట్ ఫిట్లలో మెరుస్తూ గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చేసిన ఫొటోషూట్ స్టన్నింగ్ గా ఉంది. ట్రెడిషనల్ లుక్ లోనే మెరిసినా అందాల జాతర చేసింది. 

తాజాగా పంచుకున్న ఫొటోస్ కు నెటిజన్ల గుండెలు గల్లంతనే చెప్పాలి. గతంలో ఎన్నడూ లేనంతగా సిరి గ్లామర్ మత్తు ఫోజులతో మతులు పోగొట్టింది. పర్పుల్ కలర్ లెహంగా, బ్లౌజ్ లో పరువాల ప్రదర్శన చేసింది.

మరోవైపు విరహా వేదనతో రెచ్చిపోయి ఫోజులిచ్చింది. కసి చూపులు, మత్తెక్కించే చర్యలతో కుర్రాళ్ల హార్ట్ బీట్ పెంచింది. యంగ్ బ్యూటీ గ్లామర్ మెరుపులకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 

ఈ ముద్దుగుమ్మ స్టన్నింగ్ లుక్స్ కు  నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ‘ఇలా క్రేజీగా  ఫొటోషూట్లు చేయండి’ అంటూ ఓ నెటిజన్లు కామెంట్ చేశాడు. మరో నెటిజన్ ’సిరి శ్రీహాన్ ఇలా చూస్తే ఏమైపోతాడో’ అని కామెంట్ చేశారు. 

ఇక మరికొందరు లైక్ లతో ఫొటోలను వైరల్ చేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మను ఎంకరేజ్ చేస్తున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తున్నారు.సిరికి ఇన్ స్టాలో 885కే వరకు ఫాలోవర్స్  ఉన్నారు. ఇలా వరుస ఫొటోషూట్లతో ఆ సంఖ్యను పెంచుకుంటోంది. 
 

Latest Videos

click me!