బ్లాక్ శారీలో అట్రాక్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్’ సిరి.. గ్రాండ్ లుక్ లో మైమరిపిస్తున్న యంగ్ బ్యూటీ.!

First Published | Mar 7, 2023, 4:19 PM IST

‘బిగ్ బాస్’ ఫేమ్ సిరి హన్మంత్ (siri Hanmanth) బ్లాక్ శారీలో మెరిసింది. మునుపెన్నడూ లేని రిచ్ లుక్ ను సొంతం చేసుకొని ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ ఫొటోషూట్ వైరల్ గా మారింది. 
 

యంగ్ బ్యూటీ సిరి హన్మంతు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. ఎప్పటికప్పుడు నెటిజన్లను క్రేజీ పోస్టులతో ఖుషీ చేస్తూనే ఉంటుంది. తన క్రేజ్ దక్కించుకునేందుకు బ్యాక్ టు బ్యాక్ పోస్టులు పెడుతూనే ఉంది.  
 

కింగ్, అక్కినేని నాగార్జున హోస్ట్ గా కొనసాగుతున్న ‘బిగ్ బాస్ తెలుగు’ రియాలిటీ షో సీజన్ 5లో సిరి హన్మంతు హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈషో ద్వారా బుల్లితెర  ఆడియెన్స్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది.  తనదైన శైలిలో టాస్క్ లు ఆడి అలరించింది.
 


హౌజ్ నుంచి బయటికి వచ్చాక సిరి హన్మంతుకు మంచి క్రేజ్ దక్కించింది. దీంతో బుల్లితెరపైనా ఆయా షోలలో మెరుస్తూసందడి చేస్తూ వస్తోంది. ఇప్పుడిప్పుడే యాంకర్ గా, నటిగా అవకాశాలను అందుకుంటూ వస్తోంది. ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. 
 

ఈ క్రమంలో సిరి హన్మంతు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటారు. ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునేందుకు, తన ఫాలోవర్స్ ను ఖుషీ చేసేందుకు అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు కూడా చేస్తూ వస్తోంది.. ఈ సందర్భంగా  తాజా ఫొటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది.

బ్లాక్ శారీలో, ఆకట్టుకునే జ్యూయెల్లరీ ధరించి గ్రాండ్ లుక్ ను సొంతం చేసుకుంది సిరి హన్మంతు. మునుపెన్నడూ ఇంత రిచ్ లుక్ లో కనిపించకపోవడంతో తాజాగా ఫొటోషూట్ చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రకరకాలుగా యంగ్ బ్యూటీని  పొగుడుతూ నెట్టింట వైరల్ చేస్తున్నారు. 

తాజా ఫొటోలను సోషల్ మీడియా ఫ్యాన్స్ తో పంచుకున్న సిరి హన్మంతు అదిరిపోయే క్యాప్షన్ కూడా ఇచ్చింది. ‘నన్ను తక్కువ అంచనా’ వేయొద్దు అంటూ ఫొటోలలోని  తన లుక్ ను ఉద్దేశిస్తూ క్యాప్షన్ ఇచ్చింది. దానిపైనా నెటిజన్లు తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. మొత్తం ఈ బ్యూటీ పిక్స్ ను వైరల్ చేస్తున్నారు. 
 

Latest Videos

click me!