Happy Holi: హొలీ వేడుకల్లో నవదంపతులు... సిద్ధార్థ్ బుగ్గలకుపై రంగులు అద్దిన కియారా!

Published : Mar 07, 2023, 12:26 PM IST

కియారా అద్వానీ భర్త సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి హోలీ జరుపుకున్నారు. నవదంపతులుగా రంగుల పండుగను ఘనంగా నిర్వహించారు. వారి హోలీ సెలబ్రేషన్స్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

PREV
15
Happy Holi: హొలీ వేడుకల్లో నవదంపతులు... సిద్ధార్థ్ బుగ్గలకుపై రంగులు అద్దిన కియారా!
Kiara Advani

పెళ్లయ్యాక వచ్చిన మొదటి హొలీ పండుగను కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రా ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. పండగ కోసం స్పెషల్ గా డిజైన్ చేసిన బట్టలు ధరించారు. భర్త సిద్ధార్థ్ ముఖానికి కియారా స్వయంగా రంగులు పూశారు. చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజిలిచ్చారు. 
 

25
Kiara Advani


కియారా-సిద్దార్థ్ హోలీ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. మీ జంట చాలా ముచ్చటగా ఉందంటూ అభిమానులు కాంప్లిమెంట్ చేస్తున్నారు. అలాగే హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.  
 

35
Kiara Advani

  ఫిబ్రవరి 7న బంధుమిత్రుల నడుమ కియారా మెడలో సిద్ధార్థ్ తాళి కట్టి ఆమెను సొంతం చేసుకున్నారు. పెళ్లి జరిగే వరకు ఎలాంటి ప్రకటనలు చేసుకోకూడదని వారి మధ్య ఒప్పందం ఉందట. ఆ కారణంగా పెళ్లికి కొన్ని రోజులు ముందు కూడా సిద్ధార్థ్ పెళ్లి వార్తలను పరోక్షంగా ఖండించారు.  తమ ప్రేమ పై ఎన్నడూ అధికారిక ప్రకటన చేయలేదు. పైగా వార్తలను ఖండిస్తూ వచ్చారు. దీంతో వీరి బంధం పెళ్లి వరకు వెళుతుందా లేదా అనే సందేహం కలిగింది.  
 

45
Kiara Advani'

 దాదాపు ఐదేళ్లుగా కియారా-సిద్దార్ద్ ప్రేమించుకుంటున్నారు. లస్ట్ స్టోరీస్ సిరీస్ షూట్ కంప్లీట్ అయిన సందర్భంగా యూనిట్ ఏర్పాటు చేసిన పార్టీలో కియారాను సిద్దార్థ్ మొదటిసారి కలిశారు. అప్పుడు మొదలైన పరిచయం షేర్షా మూవీ సెట్స్ లో బలపడింది. ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది.

55
Kiara Advani'


కియారా-సిద్ధార్థ్ ల వివాహానికి జైసల్మేర్ లోని సూర్య ఘడ్ కోట వేదికైంది. పెళ్ళి కేవలం సన్నిహితుల మధ్య ముగిసింది. పెళ్లి వేడుకల్లోని ఘట్టాన్ని కియారా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారుపెళ్లి వేడుకలో వధువు కియారా-వరుడు సిద్ధార్థ్ మల్హోత్రా మధ్య జరిగిన ఈ మనోహర క్షణాలు వీడియోలో బంధించారు. సదరు వీడియో కియారా తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఇక బాలీవుడ్ ప్రముఖుల కోసం ముంబైలో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున సెలెబ్రిటీలు హాజరయ్యారు. బ్లాక్ అండ్ వైట్ డిజైనర్ వేర్లో నవదంపతులు మెరిశారు. 
 

click me!

Recommended Stories