నిశ్చితార్థం జరిగి రెండేళ్లవుతున్నా ఇంకా పెళ్లి చేసుకోలేదు బిగ్ బాస్ బ్యూటీ, కార్తీక దీపం సీరియల్ విలన్ శోభా శెట్టి. ఆమె ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదని అభిమానులు గుసగుసలాడుకుంటున్న టైంలో శోభా శెట్టి పెళ్లి ఫోటోలు బయటక వచ్చాయి.
కన్నడ బ్యూటీ, తెలుగు సీరియల్ నటి, బిగ్ బాస్‌లో సందడి చేసిన శోభా శెట్టికి నిశ్చితార్థమై రెండేళ్లు అవుతోంది. తన కో యాక్టర్ యశ్వంత్ రెడ్డిని ప్రేమించిన శోభా.. గత ఏడాది నిశ్చితార్ధం చేసుకుంది. కానీ ఇప్పటి వరకూ ఆమె ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదని ఫ్యాన్స్ అడుగుతున్న టైంలో.. తాజాగా ఆమె పెళ్లి వీడియో వైరల్ అవుతోంది.
26
వివాదాలకు కేరాఫ్ అడ్రెస్
'అగ్నిసాక్షి' సీరియల్‌తో తెలుగు తెరకు పరిచయమైనా శోభా శెట్టి.. కార్తీక దీపం సీరియల్ తో తెలుగు టీవీ రంగంలోనే పాపులారిటీ సంపాదించింది. తర్వాత తెలుగు బిగ్ బాస్‌తో మరింతగా ఫేమస్ అయ్యింది బ్యూటీ. ఆతరువాత ఆమె కన్నడ బిగ్ బాస్ 11లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి అలరించింది. ఈ రెండు భాషల బిగ్ బాస్ లో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచింది శోభా శెట్టి.
36
కార్తీక దీపం సీరియల్ తో పాపులారిటీ
శోభా శెట్టి తెలుగులో 'కార్తీక దీపం' సీరియల్‌లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక తెలుగు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడే శోభా శెట్టి తన ప్రేమ విషయం వెల్లడించింది. కార్తీక దీపం సీరియల్ లో తన మరిది ఆదిత్య పాత్రలో నటించిన యశ్వంత్ రెడ్డితో ప్రేమలో ఉన్నట్లు చెప్పింది శోభా శెట్టి. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఇద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఏప్రిల్ 2024లో నిశ్చితార్థం చేసుకుని, ఈ ఏడాది ఎంగేజ్మెంట్ యానివర్సరీ కూడా జరుపుకుంది జంట.
అంతేకాదు, పెళ్లి గురించి అడిగినప్పుడు ఈ ఏడాదే చేసుకుంటానని శోభా చెప్పింది. కానీ ఇప్పటివరకు పెళ్లిపై ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. తాజాగా అందరికి షాక్ ఇస్తూ.. ఆమె పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరి పెళ్ళికి సంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
56
సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న ఫ్యాన్స్
ఈ వైరల్ వీడియో, ఫోటోలలో శోభా శెట్టి, యశ్వంత్ రెడ్డి పెళ్లి చేసుకుంటున్నట్లు ఉంది. పసుపు చీరలో శోభా, పంచెలో యశ్వంత్ తలంబ్రాలు పోసుకుంటున్న ఈ వీడియో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. వీళ్లకు ఎప్పుడు పెళ్లయిపోయింది అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
66
జువెల్లరీ యాడ్ కోసం
అయితే వీరు నిజంగా పెళ్లి చేసుకోలేదని తెలుస్తోంది. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు షూటింగ్ కోసం చేసినట్టు సమాచారం. ఒక జువెల్లరీ బ్రాండ్ యాడ్ లో వీరు నటించారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో.. గోల్డ్ సేల్స్ ఎక్కువగా ఉంటాయి. దాంతో శోభా, యశ్వంత్ పెళ్లి చేసుకున్నట్లుగా నటించి, యాడ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఫోటోలు చూసి, అసలు విషయం తెలుసుకున్న నెటిజన్లు.. మరి మీరు నిజంగా ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని ప్రశ్నిస్తున్నారు.