ప్రియాంక జైన్ కొన్నాళ్లుగా నటుడు శివ కుమార్ తో రిలేషన్ లో ఉంది. వీరిద్దరూ కలిసి జీవిస్తున్నారు . ఈ విషయాన్ని ప్రియాంక ఓపెన్ చెప్పింది. శివ కుమార్ తో తను సహజీవనం చేస్తున్నట్లు వెల్లడించింది.
26
ప్రియాంక జైన్, శివ కుమార్ సహజీవనం చేయడం పై విమర్శలు వినిపిస్తున్నాయి. పెళ్లి చేసుకోకుండా ఎలా కలిసి జీవిస్తారు. మీ పేరెంట్స్ ఏమీ అనడం లేదా అంటూ జనాలు కౌంటర్లు వేస్తున్నారు. ఈ కామెంట్స్ కి శివ కుమార్ ఆ మధ్య వివరణ ఇచ్చాడు.
36
ప్రియాంకకు పెళ్లి విషయంలో చాలా కోరికలు ఉన్నాయి. ఆమె గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. దానికి చాలా డబ్బులు కావాలి. అందుకే వివాహం ఆలస్యం అవుతుంది. అని శివ కుమార్ చెప్పుకొచ్చాడు.
46
ఆ విషయం అటుంచితే మిత్రులతో ప్రియాంక గోవా వెళ్ళింది. ఆమె హోటల్ రూమ్ నుండి నిద్ర లేచే లోపు ఎవరూ లేరట. ఆమెకు ఒక లెటర్ కనిపించిందట.రాత్రి నువ్వు చేసిన పనికి మాకు కోపం వచ్చింది. నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను, అని శివ లెటర్ రాశాడట.
56
Priyanka jain
అది చూసిన ప్రియాంక షాక్ అయ్యింది. శివ కుమార్ తనని వదిలి వెళ్లిపోవడంతో ఆమె ఫీల్ అయ్యింది . ఇంతలోనే ఆమెకు శివ కుమార్ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇదంతా ఫ్రాంక్ అని చెప్పుకొచ్చాడు. తనపై ఎలాంటి కోపం లేదని వెల్లడించాడు.
66
అయితే ప్రియాంక-శివ కుమార్ ఫ్రాంక్స్ పై విమర్శలు వినిపిస్తున్నాయి. యూట్యూబ్ వ్యూస్ కోసం దారుణమైన ఫ్రాంక్స్ చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. టేస్టీ తేజాకు గుండెపోటు వచ్చినట్లు ఫ్రాంక్ వీడియో చేసి జనాలను భయపెట్టారు.