అవినాష్ మెహందీ వేడుకలో యాంకర్ శ్రీముఖి సందడి... వైరల్ గా ఫోటోలు

First Published | Oct 20, 2021, 12:00 PM IST

జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ ఇంట పెళ్లి సందడి నెలకొంది.Mukku Avinash సింగిల్ స్టేటస్ కి టాటా చెప్పి, భర్తగా మారబోతున్నాడు. 
 

అనుజా అనే అమ్మాయితో అవినాష్ వివాహం గ్రాండ్ గా జరగనుంది. దీనితో అవినాష్ ఇంట్లో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. 
 


నిన్న హల్దీ వేడుకను ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, మిత్రులు అవినాష్ హల్దీ వేడుకను ఫుల్ జోష్ గా జరిపారు. 
 



హల్దీ వేడుక అనంతరం మెహందీ వేడుక జరుపగా... పెళ్ళికొడుకు అవినాష్ రెడ్ సల్వార్ సూట్ లో మెరిసిపోయారు. ఇక ఈ వేడుకకు అవినాష్ బెస్ట్ ఫ్రెండ్ యాంకర్ శ్రీముఖి హాజరయ్యారు. 

ప్రియమిత్రుడు అవినాష్ పెళ్లి వేడుకను Sreemukhi ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. ఆ ఫోటోలు చూస్తుంటే ఆ విషయం అర్థం అవుతుంది. 
 

తాను ఎవరికీ చెప్పుకోలేని ఆర్థిక కష్టాలలో ఉన్నప్పుడు శ్రీముఖి అడగకుండానే డబ్బులు ఇచ్చి ఆదుకుందని, ఓకార్యక్రమంలో అవినాష్ చెప్పిన విషయం తెలిసిందే. 


ఇక ఆగస్టు 31వ తేదీన అవినాష్ పెళ్లి విషయం ఫ్యాన్స్ తో పంచుకున్నారు. అనూజ అనే అమ్మాయితో తనకు నిశితార్థం జరిగిందని వెల్లడించారు. 

అనూజ తన జీవితంలోకి రావడం గొప్ప అదృష్టంగా అవినాష్... ఇంస్టాగ్రామ్ సందేశంలో తెలియజేశారు. అయితే అనుజా గురించి వివరాలేవీ తెలియరాలేదు.
 

గత ఏడాది ప్రసారమైన Bigg boss సీజన్ 4 లో పాల్గొన్న అవినాష్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా చివరి వరకు ఉన్నారు. 

ఫైనల్ కి రెండు వారాలు ముందు ఎలిమినేట్ కావడం జరిగింది. బిగ్ బాస్ షో కోసం జబర్దస్త్ వదిలేసిన అవినాష్... ప్రస్తుతం స్టార్ మా లో స్టార్ కమెడియన్స్ షో చేస్తున్నారు. 
 

Also read ముక్కు అవినాష్ ఇంటిలో పెళ్లి సందడి.. హల్దీ వేడుక ఫోటోలు షేర్ చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్!

Also read నభా ఒంటిని గట్టిగా హత్తుకున్న టైట్ ఫిట్... అందమైన ఒంపులు చూపిస్తూ హీట్ పెంచిన స్మార్ట్ బ్యూటీ!

Latest Videos

click me!