సడన్ గా జబర్దస్త్ అవినాష్ నిశ్చితార్థం... సోషల్ మీడియా ద్వారా వెల్లడి, ఇంతకీ ఈ బ్యూటీఫుల్ లేడీ ఎవరంటే!

First Published | Sep 1, 2021, 9:53 AM IST


సోషల్ మీడియా వేదికగా జబర్దస్త్ అవినాష్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు. చడీ చప్పుడు లేకుండా నిశ్చితార్థం జరుపుకొని, నాకు పెళ్లి అంటూ అందరినీ సర్ప్రైజ్ చేశారు. ఇంతకీ అవినాష్ భార్య కానున్న ఈ బ్యూటిఫుల్ లేడీ ఎవరనే ఆసక్తి అందరిలో మొదలైపోయింది. 


జబర్దస్త్ నుండి గత ఏడాది బయటికి వచ్చేశారు అవినాష్. ముక్కు అవినాష్ గా ఫేమస్ అయిన ఆయన కెవ్వు కార్తీక్ తో కలిసి టీమ్ లీడర్ గా చేయడం జరిగింది. బిగ్ బాస్ ఆఫర్ రావడంతో అవినాష్ రూ. 10లక్షలు జబర్దస్త్ నిర్మాతలకు చెల్లించి, బయటికి వచ్చారు. 


వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్లోకి ప్రవేశించిన అవినాష్.. ఆ మార్కు పోగొట్టుకోవడంతో పాటు స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్నారు. ముఖ్యంగా అవినాష్ కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేది. కేవలం ఫైనల్ కి రెండు వారాల ముందు అవినాష్ ఎలిమినేట్ అయ్యారు. 
 

Latest Videos



జబర్దస్త్ లో చోటు కోల్పోయినా.. స్టార్ మా అవినాష్ కి మరో బంపర్ ఛాన్స్ ఇచ్చింది. ఆ ఛానల్ లో కొత్తగా అవినాష్ తో కామెడీ స్టార్స్ పేరుతో ఓ షో ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం ఆ షోలో కంటెస్టెంట్ గా అవినాష్ కొనసాగుతున్నారు. 

ఇక కొన్నాళ్లుగా అవినాష్ పెళ్లి వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో అరియనాతో అవినాష్ కి స్నేహం ఏర్పడగా, వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారనే టాక్ కూడా వినిపించింది. అయితే ఈ వార్తలను అవినాష్ ఖండించారు. అలాగే తనకు సంబంధాలు చూస్తున్నట్లు, త్వరలో పెళ్లి చేసుకుంటానని వెల్లడించారు.

 
కాగా అవినాష్ కి పెళ్లి సంబంధం కుదరడంతో పాటు నిశ్చితార్ధం కూడా జరుపుకున్నట్లు, తాజా ఇంస్టాగ్రామ్ పోస్ట్ తో స్పష్టం అయ్యింది. అవినాష్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో నిశితార్ధనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. 

అనూజా అవినాష్ కి ఎంగేజ్మెంట్ జరిగింది. కరెక్ట్ పర్సన్ మన జీవితంలోకి ప్రవేశించినప్పుడు ఆలస్యం చేయకూడదు, మా కుటుంబాలు కలిశాయి, మేము కలిశాము. చాలా నిరాడంబరంగా నిశ్చితార్థం జరిగిపోయింది.  మీరు ఎప్పుడూ అడుగుతూ ఉండేవారు.. 'పెళ్లి ఎప్పుడూ?' అని, అతి త్వరలో నా అనూజాతో.. ఎప్పటికీ మీ ఆశీర్వాదాలు ఉంటాయని, మీ అవినాష్.. సారీ, అనూజా అవినాష్.. అంటూ ఇంస్టాగ్రామ్ లో కామెంట్ పెట్టారు.

 
తనకు కాబోయే భార్య పేరు అనూజాగా తెలియజేసిన అవినాష్, ఆమె పూర్తి వివరాలు వెల్లడించలేదు. అలాగే పెళ్లి తేదీ కూడా నిర్ణయించలేదని అవినాష్ పోస్ట్ ద్వారా అర్థం అవుతుంది. అయితే అవినాష్ కాబోయే భార్య అనూజా చాలా అందంగా ఉన్నారు. మొత్తంగా అవినాష్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు.

click me!