Keerthi Bhat: ప్రియుడితో పెళ్ళికి సిద్ధమైన బిగ్ బాస్ కీర్తి... నిశ్చితార్థం ఫిక్స్!

Published : Jul 28, 2023, 03:55 PM ISTUpdated : Jul 28, 2023, 04:04 PM IST

సీరియల్ నటి కీర్తి భట్ పెళ్లి పీటలు ఎక్కనుంది. ఆమె ప్రియుడు విజయ్ కార్తీక్ తో ఏడడుగులు వేయనుంది. నిశ్చితార్థం వేడుకకు ముహూర్తం ఫిక్స్ చేశారు. సన్నిహితులను ఆహ్వానిస్తున్నారు.   

PREV
16
Keerthi Bhat: ప్రియుడితో పెళ్ళికి సిద్ధమైన బిగ్ బాస్ కీర్తి... నిశ్చితార్థం ఫిక్స్!
Keerthi Bhat

కన్నడ అమ్మాయి కీర్తి భట్ తెలుగులో పాపులర్ సీరియల్స్ లో నటించారు. వాటిలో కార్తీక దీపం ఒకటి. కీర్తికి టాలీవుడ్ ఆడియన్స్ లో ఫేమ్ ఉంది. ఇక బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొన్న కీర్తి సత్తా చాటారు. తనదైన ఆట తీరు కనబరచి ఫైనల్ కి వెళ్లారు. టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచారు.
 
 

26
Keerthi Bhat

ప్రస్తుతం కీర్తి భట్ మధురానగరిలో సీరియల్ లో మెయిన్ లీడ్ చేస్తుంది. మధురానగరిలో సీరియల్ కూడా సక్సెస్ఫుల్ గా సాగుతుంది. కీర్తి భట్ ప్రస్తుత వయసు 24 ఏళ్ళు కాగా పెళ్ళికి సిద్ధమైంది. 
 

36
Keerthi Bhat

కొన్నాళ్లుగా నటుడు విజయ్ కార్తీక్ ని కీర్తి భట్ ప్రేమిస్తున్నారు. విజయ్ కార్తీక్ సైతం కన్నడ నటుడు. ఇద్దరి మనసులు కలిసిన నేపథ్యంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కీర్తికి పిల్లలు పుట్టే అవకాశం లేదట. అయినప్పటికీ కీర్తిని కార్తీక్ పేరెంట్స్ అంగీకరించారు. కీర్తి తమకు మరో పాప అని వారు పెద్ద మనసు చాటుకున్నారు. 
 

46
Keerthi Bhat

ఇటీవల ఒక షోలో కీర్తి-కార్తీక్ దండలు మార్చుకున్నారు. తాజాగా పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. నిశ్చితార్థం వేడుకకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఆగస్టు 20న బేగంపేటలో ఈ ప్రేమ జంట నిశ్చితార్థం జరగనుందట. ఈ వేడుకకు పరిశ్రమకు చెందిన సన్నిహితులను, మిత్రులను స్వయంగా ఆహ్వానిస్తున్నారు.

56
Keerthi Bhat


సీరియల్ నటులు ప్రియాంక సింగ్, అమర్ దీప్ చౌదరిలను ఆహ్వానించేందుకు కీర్తి, కార్తీక్ జానకి కలగనలేదు సీరియల్ సెట్స్ కి వెళ్లారు. వారిని కలిసి ఇన్విటేషన్ అందించారు. ఈ సందర్భాన్ని ప్రియాంక సింగ్ తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేసింది. ఈ వీడియో వైరల్ కాగా కీర్తి నిశ్చితార్థం విషయం వెలుగులోకి వచ్చింది. 

66
Keerthi Bhat

కాగా కీర్తికి ఎవరూ లేరు. ఆమె తన కుటుంబాన్ని ఒక ప్రమాదంలో కోల్పోయారు. తల్లిదండ్రులు చనిపోయాక కీర్తి నిరాదరణకు గురైంది. పట్టుదలతో నటిగా విజయం సాధించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. బిగ్ బాస్ హౌస్లో సైతం కీర్తి చాలా కరెక్ట్ గా ఉండేవారు. తన తప్పు లేదనుకుంటే కాంప్రమైజ్ అయ్యేది కాదు. కీర్తి ఎంగేజ్మెంట్ విషయం తెలిసిన ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

click me!

Recommended Stories