వివాదాస్పద వేణు స్వామితో ఇనయ సుల్తానాకు ఉన్న సంబంధం ఏమిటీ... బర్త్ డే రోజు ఏం చేసిందో చూడండి!

Published : Jan 17, 2024, 04:43 PM IST

వివాదాస్పద వేణు స్వామికి చిత్ర పరిశ్రమతో గట్టి సంబంధాలు ఉన్నాయి. స్టార్ హీరోలు, హీరోయిన్స్ ఆయన కస్టమర్స్. తాజాగా బిగ్ బాస్ ఇనయ సుల్తానా కూడా ఆయన భక్తురాలే అని తేలింది...   

PREV
16
వివాదాస్పద వేణు స్వామితో ఇనయ సుల్తానాకు ఉన్న సంబంధం ఏమిటీ... బర్త్ డే రోజు ఏం చేసిందో చూడండి!
Inaya Sulthana

నాగరిక సమాజంలో కూడా మూఢనమ్మకాలు కామన్. బాగా చదువుకున్న, హై కల్చర్ సొసైటీలో ఉన్నవాళ్లు కూడా అతీతీతులు కాదు. పూజలు, పునస్కారాలతో తమ జీవితాలు మారిపోతాయని నమ్మేవాళ్లు చాలా మంది ఉన్నారు. 

26
Bigg Boss fame Inaya Sulthana

చిత్ర పరిశ్రమలో చాలా మందికి నమ్మకాలు ఉన్నాయి. టైటిల్స్ , కాంబినేషన్స్, విడుదల తేదీలను గుడ్డిగా నమ్మేవాళ్ళు ఉన్నారు. ఇక జ్యోతిష్యులు, మంత్రగాళ్ళతో ప్రత్యేక పూజలు చేయించుకునే బ్యాచ్ ఉంది. కాగా కెరీర్లో ఎదగాలని వేణు స్వామిని సందర్శిస్తూ ఉంటాడు. 

 

36
Venu Swamy

వేణు స్వామి చాలా కాలంగా సెలెబ్రిటీలకు జ్యోతిష్యం చెబుతున్నాడు. లక్షలు ఖర్చు చేసి ఆయనతో పూజలు చేయించుకుంటారు. రష్మిక మందాన, నిధి అగర్వాల్, డింపుల్ హయాతి తో పాటు పలువురు హీరోయిన్స్ ఆయన చేత పూజలు జరిపించారు. 

46
Bigg Boss fame Inaya Sulthana

ఈ లిస్ట్ లో బిగ్ బాస్ ఫేమ్ ఇనయా సుల్తానా కూడా చేరింది. వేణు స్వామి బర్త్ డే నేపథ్యంలో అతనికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేసింది. ఆయనతో కలిసి దిగిన, పూజలు జరిపించుకున్న ఫోటోలు, వీడియోలు షేర్ చేసింది. దాంతో ఇనయ సుల్తానా కూడా ఆయన కస్టమర్ అని తేలింది. 

56
Bigg Boss fame Inaya Sulthana

వేణు స్వామి  వివాదాస్పద జ్యోతిష్యుడిగా పేరుగాంచాడు. నాగ చైతన్య, ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల పై ఆయన చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ ని హర్ట్ చేశాయి. జాతకం పేరుతో సెలబ్రిటీల కెరీర్, వ్యక్తిగత విషయాలపై వేణు స్వామి సీరియస్ కామెంట్స్ చేస్తూ ఉంటాడు. 

 

66
Inaya Sulthana

అయితే వేణు స్వామి పూజలు, ఆయన జాతకాలు నమ్మే ఇండస్ట్రీ ప్రముఖులు చాలా మంది ఉన్నారు. లక్షలు చెల్లించి ఆయనతో పూజలు జరిపిస్తారు.  హీరో బాలకృష్ణ కూడా తన కస్టమర్ అని వేణు స్వామి ఓ సందర్భంలో చెప్పారు. 

Read more Photos on
click me!

Recommended Stories