మహేష్ విగ్గు పై రచ్చ, సూపర్ స్టార్ జుట్టు వెనకున్న రహస్యం ఏమిటీ?

First Published | Sep 12, 2024, 2:00 PM IST

మహేష్ బాబు జుట్టుపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చ మొదలైంది. అందుకు ఓ సంఘటన కారణమైంది. అసలు మహేష్ బాబు జుట్టు ఒరిజినలా లేక విగ్గా?
 

Mahesh Babu

మహేష్ బాబు దేశంలోనే అత్యంత అందమైన హీరోల్లో ఒకరు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆయన అమ్మాయిల కలల రాకుమారుడు. మహేష్ వయసు ఐదు పదులకు చేరువ అవుతుంది. అయినప్పటికీ కాలేజ్ స్టూడెంట్ లా కనిపిస్తున్నారు. గ్లామర్ విషయంలో మహేష్ బాబు అత్యంత శ్రద్ధ తీసుకుంటారు. 

Mahesh Babu

సహజంగా సంక్రమించిన గ్లామర్ తో పాటు ఆహార నియమాలు పాటిస్తూ, వ్యాయామం చేయడం ద్వారా మహేష్ బాబు అందాన్ని కాపాడుకుంటున్నారు. ఆయన ఆరోగ్యకరమైన జీవన శైలి పాటిస్తున్నారు. అయితే మహేష్ బాబు జుట్టు పై అనేక సందేహాలు ఉన్నాయి. మహేష్ బాబు హెయిర్ స్టైల్ కెరీర్ బిగినింగ్ లో ఒకలా ప్రస్తుతం మరొకలా ఉంది. పోకిరి చిత్రంలో మహేష్ ఒత్తైన పొడవాటి జుట్టుతో చాలా స్టైలిష్ గా దర్శనం ఇచ్చాడు. 
 


Mahesh Babu

ఈ క్రమంలో ఆయన విగ్ వాడుతున్నాడనే సందేహాలు మొదలయ్యాయి. గతంలో మహేష్ బాబు పూర్తిగా బాల్డ్ హెడ్ తో ఉన్న ఫోటోను యాంటీ ఫ్యాన్స్ వైరల్ చేశారు. తర్వాత అది ఫేక్ అని తేలింది. అప్పుడప్పుడు మహేష్ జుట్టు పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా మహేష్ బాబు జుట్టు వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. దీనికి కారణం ఏమిటని పరిశీలిస్తే..  
 


బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఇటీవల ప్రారంభమైంది. 14 మంది కంటెస్టెంట్స్ లో నాగ మణికంఠ ఒకరు. ఫస్ట్ వీక్ నామినేషన్స్ లో నాగ మణికంఠ ఎమోషనల్ అయ్యాడు. తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ బయటపెట్టాడు. బాల్యంలోనే తండ్రి చనిపోతే తల్లి వేరే పెళ్లి చేసుకుంది. పెంపుడు తండ్రి వలన అవమానాలు, కష్టాలు పడ్డాను. 

చివరికి నా తల్లి మరణిస్తే దహన సంస్కారాలకు కూడా డబ్బులు లేక అడుక్కున్నాను, అంటూ ఏడ్చేశాడు. దాంతో నాగ మణికంఠ సింపతీ గేమ్ ఆడుతున్నాడన్న విమర్శలు వెల్లువెత్తాయి. అనంతరం బెడ్ పై ఏడుస్తూ నాగ మణికంఠ.. ఇంతకంటే ట్రాన్స్పరెంట్ గా ఉండలేను బిగ్ బాస్ అంటూ, విగ్గు తీసి విసిరి కొట్టాడు. హౌస్ నుండి బయటకు వెళ్ళాక నా జీవితం ఏమవుతుందో తెలియదని కన్నీరు పెట్టుకున్నాడు.

Naga Manikanta

అప్పటి వరకు నాగ మణికంఠ విగ్ వాడుతున్నాడన్న విషయం ఎవరికీ తెలియదు. నాగ మణికంఠ విగ్ విసిరేసిన వీడియో బాగా ట్రోల్ అయ్యింది. సోషల్ మీడియాలో దీనిపై చర్చ జరిగింది. కాగా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ కమ్ రివ్యూవర్ గీతూ రాయల్ నాగ మణికంఠకు మద్దతు తెలిపింది. నాగ మణికంఠ విగ్గు తీసేయడాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదు.అది పూర్తి విగ్గు కూడా కాదు. జస్ట్ ఎక్స్టెన్షన్ వాడాడు.

Geetu Royal

గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఇవన్నీ తప్పదు. మహేష్ బాబుకు జుట్టు పలుచబడితే ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోలేదా... అని ఆమె అన్నారు. మహేష్ జుట్టును ఉద్దేశిస్తూ గీతూ రాయల్ చేసిన ఈ కామెంట్స్ ని యాంటీ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి, మహేష్ బాబుది ఒరిజినల్ జుట్టు కాదని ఎద్దేవా చేస్తున్నారు.

గీతూ రాయల్ అనాలోచితంగా చేసిన కామెంట్స్ మహేష్ బాబు జుట్టు పై సోషల్ మీడియాలో చర్చ నడిచేలా చేశాయి. ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ గీతూ రాయల్ పై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. నీ వీడియోలు చూడమంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఇక మహేష్ అందమైన హెయిర్ స్టైల్ వెనకున్న రహస్యం మాత్రం ఎవరికీ తెలియదు. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అప్ డేట్స్ కోేసం ఇక్కడ క్లిక్ చేయండి.
 

Latest Videos

click me!