లెహంగా వోణీలో ప్రియుడి కోసం దివి వాద్య వెతుకులాట.! ‘ఎక్కడున్నవ్ రా బాబు?’ అంటూ ఆగలేకపోతున్న ‘బిగ్ బాస్’ బ్యూటీ

First Published | Nov 24, 2023, 4:38 PM IST

బిగ్ బాస్ ఫేమ్ దివి ఇంట్రెస్టింగ్ గా సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలను పంచుకుంటోంది. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ తన ప్రియుడి గురించి వెతుకుతున్నట్టుగా క్యాప్షన్ ఇచ్చింది. ఇంతకీ అతనెవరేది ఆసక్తికరంగా మారింది. 
 

నటనపై ఆసక్తితో యాక్టర్ గా యంగ్ బ్యూటీ దివి వాద్య (Divi Vadthya)  కెరీర్ ను ప్రారంభించింది. 2019లో వచ్చిన సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘మహార్షి’ చిత్రంతో వెండితెరపై మెరిసింది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో నటించి మెప్పించింది. 
 

అలాగే ‘క్యాబ్ స్టోరీస్’, ‘జిన్నా’ వంటి చిత్రాలతోనూ అలరించింది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తనకు గుర్తింపు దక్కే పాత్రలతో నటించింది. ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ  పాపులర్ రియాలిటీ షోలో అవకాశం దక్కింది. 


కింగ్ నాగార్జున హోస్ట్ గా నిర్వహిస్తున్న పాపులర్ రియాలిటీ షో Bigg Boss Telugu లో ఛాన్స్ దక్కించుకుంది. సీజన్ 4తో హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బుల్లితెర ఆడియెన్స్ ను తనదైన ఆటతీరుతో అలరించింది. హౌజ్ లో ధీటుగా పోటీనిచ్చింది. 
 

హౌజ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత దివి మరిన్ని అవకాశాలను అందుకుటోంది. రీసెంట్ గా ఓ చిత్రంలో స్పెషల్ సాంగ్ తోనూ ఆకట్టుకుంది. ఇదే సమయంలో ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్ గా కనిపిస్తోంది. 
 

నెట్టింట దివి ఎంత యాక్టివ్ గా కనిపిస్తుందో తెలిసిందే. తన గురించిన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు అందిస్తూ ఆకట్టుకుంటోంది. మరోవైపు బ్యూటీఫుల్ అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ అదరగొడుతోంది. ట్రెడిషనల్ లుక్ తో కట్టిపడేస్తోంది. తాజాగా మరిన్ని పిక్స్ ను పంచుకుంది.
 

ప్రస్తుతం దివి వెన్నిస్ నగరంలో ఉందని తెలుస్తోంది. ఫారేన్ లో కూడా ఈ ముద్దుగుమ్మ అచ్చమైన తెలుగుమ్మాయిలా లెహంగా వోణీలో ముస్తాబైంది. సంప్రదాయ దుస్తుల్లో మెరిపిస్తున్న ఈ బ్యూటీ క్యూట్ ఫోజులతో అదరగొట్టింది. కవ్వించే చేష్టలతో అట్రాక్ట్ చేసింది.

అయితే ఈ ఫొటోలను పంచుకుంటూ దివి ఇంట్రెస్టింగ్ గా క్యాప్షన్ ఇచ్చింది. ‘నీకోసం చీర కట్టుకుని రోడ్లు గల్లీలు వేతికేస్కుంటుంటే..ఎక్కడున్నావ్ రా బాబు?’ అంటూ తన ప్రియుడి కోసం గాలిస్తోంది. ఈ సందర్భంగా ఆమె వెతికేది ఎవరి కోసమంటూ ఫ్యాన్స్  సందేహిస్తున్నారు. 

గతంలోనూ ఈ ముద్దుగుమ్మ  ఇలాగే పోస్ట్ చేసింది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటూ నెటిజన్లు దివిని కామెంట్ల రూపంలో అడుగుతున్నారు. నిజంగానే దివి ఎవరితోనో రిలేషన్ లో ఉందని భావిస్తున్నారు. అతని గురించి ఎప్పుడు చెబుతుందా అని ఎదురుచూస్తున్నారు. 

Latest Videos

click me!