అదిరిపోయే గౌన్ లో దీప్తి సునైనా క్యూట్ ఫోజులు.. బ్యూటీఫుల్ స్మైల్ తో కుర్రాళ్లను మాయ చేస్తున్నయంగ్ బ్యూటీ

First Published | Jul 24, 2023, 5:13 PM IST

‘బిగ్ బాస్’తో ఫేమ్ దక్కించుకున్న యంగ్ బ్యూటీ దీప్తి సునైనా (Deepthi Sunaina) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు నయా లుక్ లో దర్శనమిస్తూ అట్రాక్ట్ చేస్తోంది. 
 

యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ బ్యూటీ దీప్తి సునైనా (Deepthi Sunaina)  యూత్ లో మంచి క్రేజ్ దక్కించుకుంది. డాన్స్ తో పాటు తన అందంతోనూ ఆకట్టుకుంది. తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సొంతం చేసుకుంది. 
 

యూత్ లో మంచి క్రేజ్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ఏకంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో అవకాశం దక్కించుకుంది. హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ బ్యూటీ తన గ్లామర్ తో టీవీ ఆడియెన్స్ ను కట్టిపడేసింది. అలాగే హౌజ్ లోని ప్రతి టాస్క్ లో చురుకుగా పాల్గొంది. 
 


ఇక బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక దీప్తికి మరింత క్రేజ్ దక్కింది. దీంతో సెలబ్రెటీగా మారిపోయింది. అటు మ్యూజిక్ వీడియోలు చేస్తూ ఆకట్టుకుంది. ఇంకా సినిమాల్లో ఛాన్స్ లు దక్కించుకోవడం లేదు. ఈ బ్యూటీ లక్ష్యంగా కూడా ఇండస్ట్రీలో హీరోయిన్ గా గుర్తింపు సాధించాలన్నదే. 
 

ప్రస్తుతం మాత్రం దీప్తి సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. వరుసగా పోస్టులు పెడుతూ వస్తోంది. బ్యూటీఫుల్ లుక్ లో మెరుస్తూ కుర్ర గుండెల్లో గంటలు మోగిస్తోంది. ఓ వైపు గ్లామర్ మెరుపులు మెరిపిస్తూనే మరోవైపు కిర్రాక్ ఫోజులతో మంత్రముగ్ధులను చేస్తోంది. 
 

తాజాగా దీప్తి సునైనా క్యూట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. బ్లూ కలర్ గౌన్ లో ఆకట్టుకుంది. క్యాజువల్ వేర్ లో కుర్రాళ్లను చూపుతిప్పుకోకుండా చేసింది. మరోవైపు స్లీవ్ లెస్ డ్రెస్ లో గ్లామర్ షోతో మెస్మరైజ్ చేసింది. అందంగా నవ్వుతూ యువతను చిత్తు చేసింది.

నెట్టింట మంచి ఫాలోయింగ్ ను దక్కించుకున్న దీప్తి ఎలాంటి పోస్టు పెట్టినా క్షణాల్లోనే వైరల్ గా మారుతుంటాయి. ఫ్యాన్స్ నుంచి లక్షల్లో లైక్స్, కామెంట్లు వస్తుంటాయి. ఈ క్రమంలో తాజాగా పిక్స్ ను కూడా అభిమానులు లైక్ చేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 

Latest Videos

click me!