రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు, వాడిని హగ్ చేసుకుని పడుకోవాలి... పచ్చిగా తన కోరికలు బయటపెట్టిన అశ్విని శ్రీ!

Published : Apr 18, 2024, 07:18 AM IST

బిగ్ బాస్ ఫేమ్ అశ్విని శ్రీ బాయ్ ఫ్రెండ్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అతడు లేక నిద్ర పట్టడం లేదట. బెడ్ పై హగ్ చేసుకొని పడుకోవాలని ఉందని క్రేజీ కోరికలు బయటపెట్టింది.   

PREV
17
రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు, వాడిని హగ్ చేసుకుని పడుకోవాలి... పచ్చిగా తన కోరికలు బయటపెట్టిన అశ్విని శ్రీ!
Bigg Boss Ashwini Sree

బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ అశ్విని శ్రీ పరిశ్రమకు వచ్చి చాలా కాలం అవుతుంది. అయితే నటిగా గుర్తింపు రాలేదు. ఆమె పలు చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసింది. బిగ్ బాస్ షో ఆమెకు భారీ ఫేమ్ తెచ్చింది. 
 

27
Bigg Boss Ashwini Sree

ఐదవ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన ఐదుగురిలో అశ్విని శ్రీ ఒకరు. హౌస్లో మిగతా వాళ్ళు తనను కలుపుకోవడం లేదని ఆమె వేదన చెందేది. భోలే షావలి, ప్రిన్స్ యావర్ తో ఆమె ఎక్కువగా స్నేహం చేశారు. 12వ వారం అశ్వనిశ్రీ ఎలిమినేట్ అయ్యింది. హౌస్లో అశ్వినిశ్రీ గ్లామర్ ఒలకబోసింది. 

 

37
Bigg Boss Ashwini Sree

అశ్విని శ్రీ కొంచెం ఓపెన్ గా ఉంటారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో అశ్వినిశ్రీ చేసిన కామెంట్స్ రచ్చ చేస్తున్నాయి. బాయ్ ఫ్రెండ్ గురించి ఆమె అశ్విని శ్రీ తన ఆలోచనలు బయటపెట్టింది. మీకు ఎలాంటి వాడు భర్తగా కావాలి అంటే... అందం, డబ్బు లేకపోయినా పర్వాలేదు. వాడు మంచివాడు అయ్యుండాలి, అన్నారు. 

47
Bigg Boss Ashwini Sree

నాకు కాబోయే వాడు ఇండస్ట్రీకి చెందినవాడు కాకూడదు. ఎందుకంటే పరిశ్రమలో ఉన్నవాడు చాలా బిజీగా ఉంటాడు. అలాంటి వాడు నన్నేం చూసుకుంటాడు. అందుకే బయటవాడు అయితే బెటర్. నేను మాత్రం ఇండస్ట్రీలోనే కొనసాగుతాను. 

57
Bigg Boss Ashwini Sree

ప్రేమకు నేను వ్యతిరేకం కాదు. కానీ చాలా మంది ప్రేమ పేరుతో వాడుకుని వదిలేద్దామనే ఉద్దేశంతో ఉంటారు. అలాంటి వాళ్లకు నేను దొరకను. నా లైఫ్ లో కరెక్ట్ పర్సన్ ఎదురుకాలేదు. దొరికితే వెంటనే పెళ్లి చేసుకుంటాను. వాడి కోసమే ఎదురు చూస్తున్నాను. ఎక్కడ ఉన్నావ్? త్వరగా రారా బాబు. వాడిని చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. వాడు లేక నాకు నిద్ర పట్టడం లేదు. 

67
Bigg Boss Ashwini Sree

నాకు లాగే తాను కూడా క్రేజీగా ఉండాలి.  బెడ్ పై వాడు తోడుగా ఉంటే కానీ నిద్ర పట్టదేమో. వాడు అంటే నా డ్రీం బాయ్. నిజంగా నాకు రాత్రి 4 అవుతున్నా నిద్ర పట్టడం లేదు. వాడు ఉంటే హగ్ చేసుకుని పడుకుంటాను. వాడి కోసం నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాను.. అంటూ కొంచెం పచ్చిగా తన కోరికలు బయటపెట్టింది. 

 

77
Ashwini Sri

చూస్తుంటే నచ్చినవాడు దొరికితే వాడి మీద ఇప్పటి వరకు దాచుకున్న ప్రేమ మొత్తం కుమ్మరించేలా ఉంది అశ్విని శ్రీ. ఆ లక్కీ ఫెలో ఎవరో చూడాలి. మరోవైపు  బిగ్ బాస్ తర్వాత అశ్విని శ్రీ కెరీర్ ఊపందుకున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఆమెకు హీరోయిన్ గా కూడా ఆఫర్స్ వస్తున్నాయని సమాచారం. 

click me!

Recommended Stories