సింపుల్ లుక్ లో కట్టిపడేస్తున్న అషురెడ్డి.. ’ఎప్పుడూ దయతో ఉండండి‘ అంటూ బిగ్ బాస్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్

First Published | Jun 28, 2023, 12:42 PM IST

‘బిగ్ బాస్’ బ్యూటీ అషురెడ్డి తాజాగా సింపుల్ లుక్ లో నెట్టింట దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా తన ఫొటోలకు క్యాప్షన్ గా ‘ఎప్పుడూ దయ కలిగి ఉండండి’ అని మెన్షన్ చేయడం ఆసక్తికరంగా మారింది. 
 

డబ్ స్మాష్ వీడియోలతో యంగ్ బ్యూటీ అషురెడ్డి (Ashu Reddy) మంచి క్రేజ్ దక్కించుకుంది. ఆ క్రేజ్ తోనే కింగ్, అక్కినేని నాగార్జున్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న Bigg Boss Telugu రియాలిటీ షోకు ఎంట్రీ ఇచ్చింది. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 మరియు సీజన్ 5లో హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఏకంగా రెండు సార్లు బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. ప్రతి టాస్క్ లో తనదైన శైలిని ప్రదర్శించి ఆకట్టుకుంది. మరింత క్రేజ్ ను సాధించింది.
 


హౌజ్ నుంచి బయటకి వచ్చాక అషురెడ్డి చాలా ఈవెంట్లకు హాజరైంది. తరుచూగా విదేశాల్లోనే సందడి చేస్తూ కనిపిస్తుంది. అందుకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు తన అభిమానుతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటుంది. 
 

తాజాగా ఈ ముద్దుగుమ్మ విదేశపు వీధుల్లో తిరుగుతున్న సందర్భంగా కొన్ని ఫొటోలకు ఫోజులిచ్చింది. సింపుల్ లుక్ లో దర్శనమిచ్చిన ఈ ముద్దుగుమ్మ చాలా సాధారమైన లుక్ తోనూ ఆకట్టుకుంది. ఎలాంటి హంగామా లేకుండా పద్ధతిగా కనిపించింది. 
 

అషురెడ్డి నయా లుక్ కు ఫ్యాన్స్  ఫిదా అవుతున్నారు. ఎప్పుడూ ఇలాగే కనిపిస్తూ ఉండూ అంటూ సూచిస్తున్నారు. అలాగైతే మరిన్ని సినిమా అవకాశాలూ వస్తాయంటూ తెలుపుతున్నారు. ఈ ముద్దుగుమ్మ సింపుల్ లుక్ ను పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 
 

అయితే, కొద్దిరోజుల కింద అషురెడ్డి ఓ డ్రగ్స్ కేసులో ఉందని వార్తలు వస్తున్నాయి. నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ వివాదంలో ఈ బ్యూటీ పేరు కూడా బయటకి వచ్చింది. ఈక్రమంలో లేటెస్ట్ పిక్స్ ను షేర్ చేస్తూ ‘ఎప్పుడూ దయతో ఉండండి’ అంటూ హ్యాష్ ట్యాగ్ ఇచ్చింది. 
 

ఇక డ్రగ్స్ కేసులో అషురెడ్డి పేరు రావడాన్ని ఖండించింది. తనకెలాంటి సంబంధం లేదంటూ చెప్పుకొచ్చింది. అలాంటి వ్యక్తులతో తనకు పరిచయం కూడా లేదని బదులిచ్చింది. ప్రస్తుతం ఈ క్రేజ్ లో కేపీ చౌదరిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.  మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి. 
 

Latest Videos

click me!