Published : Dec 12, 2023, 10:42 AM ISTUpdated : Dec 12, 2023, 10:47 AM IST
బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ క్రేజీ కామెంట్స్ తో నెటిజెన్స్ ని ఆకర్షిస్తున్నారు. ఇంస్టాగ్రామ్ వేదికగా అరియానా బోల్డ్ కామెంట్స్ పోస్ట్ చేసింది. అవి వైరల్ అవుతున్నాయి.
అరియానా గ్లోరీ బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్నారు. యాంకర్ హోదాలో ఆమె హౌస్లో అడుగుపెట్టారు. అప్పటి వరకు అరియానా గురించి పెద్దగా తెలియదు.
27
Ariyana glory
అరియానా స్ట్రాంగ్ ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకుంది. తన ఆట తీరుతో అభిమానులను సొంతం చేసుకుంది. అరియానా ముక్కుసూటిగా మాట్లాడేవారు. ఒక వీకెండ్ కి హోస్టింగ్ చేసిన సమంత... అరియానా లో తనని చూసుకున్నట్లు చెప్పింది.
37
Ariyana glory
అరియనా బిగ్ బాస్ తెలుగు 7 ఫైనలిస్ట్స్ లో ఒకరు. అభిజీత్, అఖిల్, సోహైల్, అరియానా, అలేఖ్య ఫైనల్ కి వెళ్లారు.
47
Ariyana glory
అరియానా టాప్ 4గా నిలిచింది. సోహైల్ నాగార్జున ఆఫర్ చేసిన డబ్బులు తీసుకుని టైటిల్ రేసు నుంచి తప్పుకున్నాడు. అభిజీత్ విన్నర్ అయ్యాడు.
57
Ariyana glory
బిగ్ బాస్ షోతో అరియానాకు మంచి పాపులారిటీ దక్కింది. ఆమె బుల్లితెరపై సందడి చేస్తున్నారు. ఇటీవల ముగిసిన బీబీ జోడీ షోలో అరియానా పాల్గొంది.
67
Ariyana glory
ఈ సీజన్ లో ఆమె అమర్ దీప్ కి సపోర్ట్ చేస్తున్నారు. అమర్ దీప్ కి ఓటు వేయాలని సోషల్ మీడియాలో క్యాంపైన్ చేస్తుంది.
77
Ariyana glory
కాగా అరియానా గ్లోరీ ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుంది. ఆమె ట్రెండీ టాప్ ధరించి సూపర్ స్టైలిష్ గా కనిపించింది. సదరు ఫోటోలకు 'చెడ్డ అమ్మాయిగా ఉండేందుకు నేను బాధపడను' అంటూ కామెంట్ చేసింది. అరియానా క్రేజీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.