Anchor Lasya
ఒకప్పుడు బుల్లితెర మీద సంచలనాలు చేసింది లాస్య. యాంకర్ గా పలు షోలలో తన మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫార్మ్ లో ఉన్నప్పుడే లాస్య యాంకరింగ్ మానేసింది. కారణం తెలియదు కానీ సడన్ గా బుల్లితెరకు దూరమైంది.
Anchor Lasya
గ్యాప్ ఇచ్చి బిగ్ బాస్ షోలో ప్రత్యక్షమైంది. 2020లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 4లో లాస్య పార్టిసిపేట్ చేసింది. లాస్య హౌస్లో తన ఆట తీరు, మాట తీరుతో ఆకట్టుకుంది. హౌస్ మేట్స్ కి రోజూ రుచికరమైన భోజనం వండి పెట్టేది. చాలా వరకు లాస్య హౌస్లో కూల్ గా ఉండేది.
అభిజీత్, అలేఖ్య హారిక, నోయల్ లతో ఎక్కువగా కలిసి ఉండేది. లాస్య ఫైనల్ కి వెళ్ళలేదు. హౌస్ నుండి బయటకు వచ్చాక లాస్య సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. ఆమెకు ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సదరు ఛానల్ లో ఆసక్తిర వీడియోలు పోస్ట్ చేస్తుంటారు.
Anchor Lasya
లాస్య ప్రేమ వివాహం చేసుకుంది. లాస్య భర్త పేరు మంజునాథ్. కాగా మంజునాథ్ చేతిలో దెబ్బలు తింది లాస్య. భర్త లాస్యను ఎందుకు కొట్టాడు? ఇద్దరి మధ్య ఎందుకు గొడవైందని పరిశీలిస్తే... ఇది నిజం గొడవ కాదు. ఉత్తుత్తి గొడవే.
Anchor Lasya
ఓ ఫన్నీ రీల్ చేసిన లాస్య ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. బాగా వైరల్ అవుతున్న కుమారి ఆంటీ డైలాగ్ తో లాస్య రీల్ చేసింది. భర్తకు చేపల కూర వడ్డించిన లాస్య 'మీది మొత్తం థౌసండ్. రెండు లివర్లు ఎక్స్ట్రా' అని చెప్పింది. ఆ మాటకు మంజునాథ్ లాస్య మీదకు కుర్చీ ఎత్తాడు.
Anchor Lasya
జస్ట్ ఫర్ ఫన్... మీరు ఇష్టపడతారని భావిస్తున్నా... అని సదరు వీడియోకి లాస్య కామెంట్ పెట్టింది. లాస్య మంజునాథ్ చేసిన ఈ రీల్ వైరల్ గా మారింది. కాగా లాస్యకు ఇద్దరు కుమారులు. తన అందమైన ఫ్యామిలీని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి పరిచయం చేస్తుంటుంది లాస్య.