రీసెంట్ గా సలార్ సినిమాతో హిట్ కొట్టాడు ప్రభాస్. బాహుబలి తరువాత యంగ్ రెబల్ స్టార్ కు ఊరటనిచ్చిన సినిమా ఇదే. అంతకు ముందు పాన్ ఇండియా సినిమాలుగా వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి ప్రభాస్ ను. దాంతో సలార్ ఇచ్చిన హిట్టు ప్రభాస్ ను ఊపిరిపీల్చుకునేలా చేసింది. ఈ ఊపుతోనే కల్కీ.. రాజాసాబ్, స్పిరిట్ తో పాటు.. త్వరలో సలార్ 2 సినిమాలు ఒకదాని వెంట మరొకటి ప్లాన్ చేసుకుంటున్నాడు ప్రభాస్. అంతే కాదు ఈ లిస్ట్ లో రీసెంట్ గా హనురాఘవపూడి సినిమా కూడా చేరినట్టు తెలుస్తోంది.