బందీలుగా అమర్ దీప్, తేజస్విని... కాపాడేందుకు రంగంలోకి దిగిన టీమ్! అసలు ఏం జరిగింది?

Published : Mar 22, 2024, 07:17 AM ISTUpdated : Mar 22, 2024, 07:30 AM IST

అమర్ దీప్ చౌదరితో పాటు ఆయన భార్య ఓ ఇంటిలో బందీలుగా అయిపోయారట. వారిని బయటకు తీసుకు వచ్చేందుకు ఒక టీమ్ గంటల తరబడి కష్టపడాల్సి వచ్చిందట. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం...   

PREV
16
బందీలుగా అమర్ దీప్, తేజస్విని... కాపాడేందుకు రంగంలోకి దిగిన టీమ్! అసలు ఏం జరిగింది?

బిగ్ బాస్ రన్నర్ అమర్ దీప్ కెరీర్ ఊపందుకుంటుంది. అతడికి హీరోగా అవకాశాలు వస్తున్నాయి. గతంలో అమర్ దీప్ సీరియల్స్ లో నటించేవాడు. అలాగే కొన్ని వెబ్ సిరీస్లు చేశాడు. బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్న అమర్ దీప్ తన పాపులారిటీ పెంచుకున్నాడు. 


 

26
Amar Deep Chowdary

ఇటీవల అమర్ దీప్ ఒక చిత్రం లాంచ్ చేశాడు. ఈ చిత్రంలో అమర్ దీప్ కి జంటగా నటి సురేఖావాణి కూతురు సుప్రీత నటిస్తుంది. సుప్రీతకు ఇది డెబ్యూ మూవీ. టైటిల్ పెట్టాల్సి ఉండగా చిత్రీకరణ జరుపుకుంటుంది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారని సమాచారం. 

 

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

36

కాగా అమర్ దీప్ సీరియల్ నటి తేజస్విని గౌడను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కాగా చెన్నైలో అమర్ దీప్, తేజస్విని బందీలు అయ్యారట. వారు ఉన్న గదిని షట్టర్ తో మూసేసి వెల్డింగ్ చేశారట. ఈ విషయాన్ని తేజస్విని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేసింది. 
 

46


ఇది గతంలో జరిగిన సంఘటన అట. నీతోనే డాన్స్ షోలో పాల్గొన్న అమర్ దీప్, తేజస్విని తమ ఫ్రెండ్స్ తో చెన్నైలోని ఒక హౌస్లో ప్రాక్టీస్ చేస్తున్నారట. వాళ్ళు ఫుడ్ ఆర్డర్ పెట్టగా డెలివరీ బాయ్ వచ్చి... షట్టర్ వేసి ఉందని చెప్పాడట. ఆ షట్టర్ తీయకుండా వెల్డింగ్ కూడా చేశారట. మొదట్లో వాళ్ళు చాలా కంగారు పడ్డారట. 

 

56
Amardeep Chowdary

ఆ బిల్డింగ్ ఓనర్ తో మరొకరికి వివాదం ఉన్న నేపథ్యంలో ఆ గదికి షట్టర్ వేశారట. ఫోన్లు చేయడంతో తమ వారు వచ్చి షట్టర్ ఓపెన్ చేశారట. ఈ విషయాన్ని తెలియజేస్తూ తేజస్విని గౌడ తన యూట్యూబ్ ఛానల్ లో వీడియో పోస్ట్ చేసింది. అయితే బందీలుగా ఉన్న సమయంలో వాళ్ళు సరదాగానే గడిపారు. పెద్దగా టెన్షన్ కి గురి కాలేదు.

66

తేజస్విని తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది. కాగా బిగ్ బాస్ ఫినాలే రోజు అమర్ దీప్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. అమర్ దీప్ కారును అడ్డుకుని అద్దాలు పగలగొట్టారు. ఆ సమయంలో అమర్ దీప్ తో పాటు తేజస్విని గౌడ, తల్లి ఉన్నారు. ఈ ఘటనపై తేజస్విని గౌడ, అమర్ దీప్ ఆవేదన చెందిన సంగతి తెలిసిందే!

click me!

Recommended Stories