పైట కొంగు పక్కకు జరిపి నెలవంక నడుము చూపిస్తూ బిగ్ బాస్ దివి రచ్చ... వైరల్ గా హాట్ ఫోటో షూట్!

First Published | Jul 30, 2021, 10:20 AM IST

నీలి రంగు చీరలో నెల వంక నడుము చూపిస్తూ సెగలు రేపింది బిగ్ బాస్ దివి. చీరలో తన అందాలు మరింత హాట్ గా ఉంటాయని నిరూపిస్తూ కుర్రకారు మనసులు దోచేసింది. 

ఆడ వాళ్లను అందంగా చూపించడంలో చీర కట్టుకు మరే డ్రెస్ సరిరాదని దివిని చూస్తే అర్థం అవుతుంది. ఆమె సన్నజాజి వంటి సన్ననైన నాజూకు శరీరంపై చీర కట్టు మతిపోగొడుతోంది.
అందమైన మగువలు చీర కడితే ఆ చీరకే అందం అన్న నానుడిని దివి నిజం చేసి చూపించింది. దివి సెక్సీ ఫోటో షూట్ వైరల్ అవుతుండగా, ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

హీరోయిన్ గా వెండితెరపై వెలిగిపోవాలన్న ఆశలతో పరిశ్రమలో అడుగుపెట్టిన తెలుగమ్మాయి దివికి సరైన బ్రేక్ దక్కలేదు. హీరోయిన్ గా అవకాశాలు వచ్చినా, అవి చాలా చిన్న సినిమాలు కావడంతో ఆమెకు గుర్తింపు రాలేదు.  దీనితో స్టార్ హీరోల సినిమాలలో కనీసం డైలాగ్స్ కూడా లేని పాత్రలు చేశారు.
మహేష్, పూజా హెగ్డే కాంబినేషన్ లో వచ్చిన మహర్షి మూవీలో కాలేజ్ స్టూడెంట్ గా దివి చేయడం విశేషం.  ఫేమ్ కోసం తపిస్తున్న దివికి బిగ్ బాస్ షో రూపంలో మంచి అవకాశం దక్కింది.
కరోనా పరిస్థితుల కారణంగా పేరున్న సెలెబ్రిటీలు హౌస్ లోకి వెళ్ళడానికి నిరాకరించారు. దీనితో దివికి అవకాశం దక్కింది.  బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ గా దివి తన మార్కు గేమ్ తో హౌస్ లో చాలా కాలం కొనసాగారు.
కేవలం ఒకరిద్దరికి దగ్గరగా ఉండడం, తనపని తాను చేసుకుపోవడం చేసేది దివి. సెన్సేషన్స్ కి దూరంగా ఉన్న దివికి మంచి గ్లామర్ ఉన్నా, ఫైనల్ కి చేరడంలో ఫెయిల్ అయ్యింది.  అయితే గతం కంటే బెటర్ పాపులారిటీ రాబట్టారు.
దివి అనే ఓ తెలుగు హీరోయిన్ ఉందన్న విషయం ప్రేక్షకులకు తెలిసింది. బిగ్ బాస్ షో తరువాత దివి కెరీర్ వేగం పుంజుకుంది. ఆమెకు వెబ్ సిరీస్ లు ,చిత్రాలలో అవకాశాలు వస్తున్నాయి.
ఆమె నటించిన వెబ్ సిరీస్ క్యాబ్ స్టోరీస్ విడుదల కావాల్సి ఉంది. ఈ సిరీస్ లో దివి బోల్డ్ రోల్ చేసినట్లు సమాచారం.
అలాగే స్పెషల్ సాంగ్స్ లో నటిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది దివి. ఇటీవల ఆమె నటించిన ఓ ప్రైవేట్ సాంగ్ యూట్యూబ్ లో విడుదలై విశేష ఆదరణ దక్కించుకుంది.

Latest Videos

click me!