సత్యదేవ్‌ `తిమ్మరుసు` యూఎస్‌ ప్రీమియర్‌ షో రివ్యూ .. ఫస్ట్ బొమ్మ బ్లాక్‌ బస్టరేనా?

First Published Jul 30, 2021, 7:11 AM IST

కరోనా సెకండ్‌ వేవ్‌ అనంతరం థియేటర్లు ఓపెన్‌ అయ్యాక విడుదలవుతున్న తొలి చిత్రం `తిమ్మరుసు`. సత్యదేవ్‌ హీరోగా నటించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలవుతుంది. యూఎస్‌ ప్రీమియర్స్ షోస్‌ కూడా పడటం విశేషం. మరి అక్కడి రివ్యూ ఎలా ఉందో చూద్దాం. 

కరోనా ఫస్ట్ వేవ్‌ అనంతరం థియేటర్లు ఓపెన్‌ అయ్యాక కొన్ని సినిమాలు విడుదలయ్యాయి. ఆడియెన్స్ కి థియేటర్‌ అలవాటు చేశారు. ఆ తర్వాత సాయితేజ్‌ నటించిన `సోలో బ్రతుకే సోబెటర్‌` సినిమా మొదటగా విడుదలై మంచి స్పందన దక్కించుకుంది.అలా ఇప్పుడు సెకండ్‌ వేవ్‌ అనంతరం విడుదలవుతున్న తొలి చిత్రంగా సత్యదేవ్‌ నటించిన `తిమ్మరుసు` నిలిచింది. ప్రియాంక జవాల్కర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకి శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహించగా, మహేష్‌ కోనేరు నిర్మించారు. నేడు శుక్రవారం ఈ సినిమా థియేటర్లో తన అదృష్టాన్నిపరీక్షించుకోనుంది.
undefined
`బ్లఫ్‌ మాస్టర్‌`తో హీరోగా ఓ మార్క్ క్రియేట్‌ చేసుకున్న సత్యదేవ్‌ గతేడాది కరోనా సమయంలో `ఉమామహేశ్వర ఉగ్రరూపస్య` చిత్రంతో సూపర్‌ హిట్‌ అందుకున్నారు. ఈ సినిమా ఓటీటీలో విడుదలైనా మంచి ఆదరణ పొందింది. హీరోగా సత్యదేవ్‌ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లింది. ఇప్పుడు ఆయన్నుంచి వస్తోన్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు, ఆసక్తి పెరిగింది.
undefined
మరోవైపు ఈ చిత్ర ట్రైలర్‌ని ఎన్టీఆర్‌ రిలీజ్‌ చేయడం, ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో అతిథిగా వచ్చిన నాని థియేటర్లపై సంచలన వ్యాఖ్యలు చేయడం సినిమాపై మరింత హైప్‌ పెంచింది. ఇందులో `టాక్సీవాలా` ఫేమ్‌ ప్రియాంక జవాల్కర్‌ గ్లామర్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌ కానుంది. `కిర్రాక్‌ పార్టీ`కి పనిచేసిన శరణ్‌ కొప్పిశెట్టి ఈచిత్రంతో దర్శకుడిగా తన సత్తా చాటబోతున్నారు. మరి సినిమా యూఎస్‌ ప్రీమియర్ రిపోర్ట్ ఎలా ఉందనేది చూస్తే...
undefined
కథ విషయానికి వస్తే.. సినిమా క్యాబ్‌ డ్రైవర్‌ మర్డర్‌తో స్టార్ట్ అవుతుంది. అదే రోజు రాత్రి యాక్సిడెంట్‌ జరుగుతుంది. అమాయకుడైన ఓ యంగ్‌ మ్యాన్‌(వాసు) ఈ మర్డర్‌ కేసులో ఇరుక్కుంటాడు. అంతలో యంగ్‌ లాయర్‌ రామ్‌(సత్యదేవ్‌) ఎంట్రీ ఇస్తాడు. ఆయన చాలా నిజాయితీగల లాయర్‌. పేద వారి కోసం తన లీగల్‌ సర్వీస్‌ ని ఫ్రీగా అందిస్తుంటాడు. ఈ మర్డర్‌ కేసులో నింధింపడుతున్న యంగ్‌ బాయ్‌ తరఫున తాను వాదించేందుకు ముందుకొస్తాడు రామ్‌. ఈ కేసులో ఆయన లూప్‌ హోల్స్ ని పట్టుకుని కేసుని ఎలా వాధించాడు? అందుకు హీరోయిన్‌ ప్రియాంక జవాల్కర్‌, బ్రహ్మాజీ ఎలా సహకరించారు? ఈ కేసులో చోటు చేసుకున్న మలుపులేంటి? సత్యదేవ్‌ ఎలాంటి ఎత్తులేశాడు? ఫైనల్‌గా కేసు గెలిచాడా? లేదా? అన్నది సినిమా.
undefined
విశ్లేషణః కథ పరంగా చాలా గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లేతో సాగింది. సినిమా ప్రారంభంలోనే మర్డర్‌ కేసు చూపించడంతో డైరెక్ట్ కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. ఆరంభం నుంచే సినిమాపై ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేశాడు. ప్రారంభం నుంచి సినిమా అదే గ్రిప్పింగ్‌తో సాగింది. నిజాయితీ గల లాయర్‌ సత్యదేవ్‌కి, ప్రత్యర్థులకు మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియెన్స్ కి గూస్‌బమ్స్ తెప్పిస్తుంటాయి.
undefined
అదే సమయంలో యాక్షన్‌ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. మరోవైపు బ్రహ్మాజీతో వచ్చే సన్నివేశాలు కామెడీని పంచుతాయి. ప్రియాంకతో లవ్‌ సీన్స్ రొమాంటిక్‌ ఫీల్‌ని తీసుకొస్తుంటారు. ఓ అమాయకుడిని మర్డర్‌ కేసులో ఇరికించిన విధానం, దాని వల్ల అతను పడుతున్న ఇబ్బందులు ఎమోషనల్‌గానూ కనెక్ట్ అవుతుంటాయి. మొత్తంగా యాక్షన్‌, కామెడీ, రొమాన్స్, ఎమోషనల్‌ కలగలిపిన సినిమాగా దీన్ని చెప్పొచ్చు. ఫైనల్‌గా కేసు గెలిచే సన్నివేశాలు,ఈ క్రమంలో చోటు చేసుకున్న డ్రామా కట్టిపడేస్తుంది.
undefined
ముఖ్యంగా కోర్ట్ రూమ్‌ అంశాలు ఎంగేజ్‌ చేస్తుంటారు. అదే సమయంలో ప్రత్యర్థులతో సవాళ్లు, డైలాగులు సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాయని చెప్పొచ్చు. ఈ కేసులో సత్యదేవ్‌ క్లూస్‌ కనిపెట్టే సన్నివేశాలు ఇంట్రెస్ట్ ని క్రియేస్ట్ చేస్తుంటే మధ్య మధ్యలో వచ్చే ట్విస్ట్, టర్న్ లు, ఇంటర్వెల్‌, క్లైమాక్స్ , యాక్షన్‌ సీన్స్‌ ఆడియెన్స్ ని కట్టిపడేస్తాయి. ఇక లాయర్‌గా సత్యదేవ్‌ నటన సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాయని చెప్పొచ్చు. ప్రియాంక గ్లామర్‌ పరంగా, అక్కడక్కడ పర్వాలేదనిపించింది. బ్రహ్మాజీ కామెడీ పార్ట్ ని చూసుకుని రిలీఫ్‌ ఇచ్చాడు. దర్శకుడు శరణ్‌ కొప్పిశెట్టికిది తొలి చిత్రమైన చాలా గ్రిప్సింగ్‌గా సినిమాని తీయడం సక్సెస్‌ అయ్యాడు. కొత్త దర్శకుడనే ఆలోచన ఏ సందర్భంలోనూ తీసుకురాలేదు. చాలా వర్క్ చేసినట్టు సినిమాని చూస్తుంటే స్పష్టంగా కనిపిస్తుంది.
undefined
మొత్తంగా మంచి గ్రిప్పింగ్‌ థ్రిల్లర్‌గా `తిమ్మరుసు`ని చెప్పుకోవచ్చు. సెకండ్‌ వేవ్‌ అనంతరం విడుదలైన తొలి సినిమాగా సత్యదేశ్‌ `తిమ్మరుసు` మంచి సక్సెస్‌ ని తనఖాతాలో వేసుకోబోతున్నాడనే యూఎస్‌ ప్రిమియర్స్ రివ్యూని బట్టి అర్థమవుతుంది. అసలైన `ఏషియానెట్‌` రివ్యూ మరి కాసేపట్లో రానుంది. అప్పటి వరకు వెయిట్‌ చేయండి.
undefined
click me!