హాఫ్ శారీలో నడుము అందంతో మైమరిపిస్తున్న అరియానా.. ట్రెడిషనల్ వేర్ లో బ్యూటీఫుల్ లుక్

First Published | Oct 14, 2023, 2:07 PM IST

యంగ్ బ్యూటీ అరియానా గ్లోరీ సోషల్ మీడియాలో తరుచూ బ్యూటీఫుల్ ఫొటోస్ తో దర్శనమిస్తూ ఆకట్టుకుంటోంది. ట్రెడిషనల్ వేర్స్ లో మరింత అందాన్ని సొంతం చేసుకుంటూ అట్రాక్ట్ చేస్తోంది. 
 

యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అరియానా గ్లోరీ (Ariyana Glory)  ప్రస్తుతం సెలెబ్రెటీగా బుల్లితెరపై సందడి చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ షోల్లో దర్శనమిస్తూ టీవీ ఆడియెన్స్ ను అలరిస్తోంది. తన బ్యూటీఫుల్ లుక్, పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటోంది. 
 

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో అరియానా గ్లోరీ పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఆర్జీవీ చేసిన కామెంట్ తో ఈ ముద్దుగుమ్మ కెరీర్ మలుపు తిరిగింది. దాంతో పాపులర్ రియాలిటీ షో Bigg Boss Telugu లో ఛాన్స్ దక్కించుకుంది. 


కింగ్, అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ రియాలిటీ షోలో సీజన్ 4, 5లో అరియానా కంటెస్టెంట్ గా టైటిల్ కోసం హౌజ్ లో తనదైన శైలిలో గేమ్ ఆడింది. ఆ తర్వాత ‘బీబీ కెఫే’, ‘బీబీ జోడీ’ వంటి షోలతోనూ  ఆకట్టుకుంది. 

ఈక్రమంలోనే అరియానా సోషల్ మీడియాలోనూ తరుచూ పోస్టులు పెడుతూ వస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ గ్లామర్ విందు చేస్తోంది. ఇటీవల మాత్రం ఈ ముద్దుగుమ్మ ట్రెడిషనల్ లుక్ లోనే మెరుస్తోంది. సంప్రదాయ దుస్తులతో ఆకట్టుకుంటోంది.

తాజాగా హాఫ్ శారీలో పద్ధతిగా మెరిసింది. గ్రీన్ లెహంగా, బ్లౌజ్, పింక్ శారీలో చక్కగా దర్శనమిచ్చింది. క్యూట్ గా ఫొటోలకు ఫోజులిచ్చింది. మరోవైపు సైడ్ యాంగిల్లో నడుము అందాన్ని కూడా చూపించి ఫ్యాన్స్, నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి బిక్కిరి చేసింది. ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 
 

ప్రస్తుతం అరియానా జీతెలుగులో ప్రసారం కానున్న Telugu Medium  Ischool రియాలిటీ షోలో అలరిస్తోంది. సన్నీ లియోన్ ఈ షోకు జడ్జీగా వ్యవహిరిస్తుండటం విశేషం. యాంకర్ గా రవి, కొరియోగ్రాఫర్ పండు కూడా అలరిస్తున్నారు. ఇటీవల ఫస్ట్ ఎపిసోడ్ కూడా విడుదలైంది.  అరియానా తన డాన్స్ లో అదరగొట్టింది.  

Latest Videos

click me!