మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ కృష్ణ మధ్య సినిమాల పోటీ చాలా సార్లు నెలకొంది. అయితే చిరు `గూండా` సినిమా దెబ్బకి హిట్ కావాల్సిన కృష్ణ మూవీ కాస్త అడ్రస్ లేకుండా పోయింది.
మాస్ యాక్షన్ సినిమాల విషయంలో మొదట ఎన్టీఆర్‌కి, సూపర్ స్టార్ కృష్ణకి మధ్య పోటీ ఉండేది. పౌరాణిక చిత్రాలు పక్కనపెడితే ఎన్టీరామారావు ఎక్కువగా మాస్, కమర్షియల్ ఎలిమెంట్లతో కూడిన యాక్షన్ సినిమాలే చేశారు. ఆ తర్వాత అదే పంథాలో సూపర్ స్టార్ కృష్ణ యాక్షన్ మూవీస్ చేశారు. దీంతో వీరిద్దరి మధ్య పోటీ ఉండేది. రామారావు సినిమాలు మానేశాక.. కృష్ణ, చిరంజీవి మధ్య ఆ పోటీ నెలకొంది. డాన్సులు, ఫైట్లు, ఫాటలతో చిరు మాస్ ఆడియెన్స్ ని ఉర్రూతలూగించారు. దీంతో కృష్ణకి చిరు గట్టి పోటీ ఇచ్చారని చెప్పొచ్చు.
25
మంచి వసూళ్లని రాబట్టిన కృష్ణ `రక్తసంబంధం`
అయితే చిరంజీవి `గూండా` సినిమా సమయంలో సూపర్‌స్టార్ కృష్ణ నటించిన ఓ మూవీ దారుణంగా దెబ్బతిన్నది. హిట్ కావాల్సిన మూవీ కాస్త అడ్రస్ గల్లంతయ్యే పరిస్థితి నెలకొంది. ఆ మూవీ ఏంటనేది చూస్తే. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా ఆయన భార్య విజయ నిర్మల దర్శకత్వంలో `రక్తసంబంధం` అనే మూవీ తెరకెక్కింది. ఇందులో రాధా హీరోయిన్‌గా నటించింది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం 1984 ఫిబ్రవరి 16న విడుదలైంది. మంచి టాక్ తెచ్చుకుంది. మొదటివారం మంచి వసూళ్లని కూడా రాబట్టింది.
35
చిరంజీవి `గూండా` కోసం క్యూ కట్టిన మాస్ ఆడియెన్స్
`రక్తసంబంధం` విడుదలైన వారం గ్యాప్‌తో మెగాస్టార్ చిరంజీవి నటించిన `గూండా` మూవీ విడుదలైంది. ఈ చిత్రానికి కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఇందులోనూ రాధా హీరోయిన్. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. 1984 ఫిబ్రవరి 23న విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ టాక్‌ని తెచ్చుకుంది. తొలి వారం భారీ వసూళ్లని రాబట్టింది. ఊపు తెచ్చే పాటలు, యాక్షన్ లాంటి కమర్షియల్ ఎలిమెంట్లు ఫుల్‌గా ఉండటంతో మాస్ ఆడియెన్స్ ఈ మూవీకి బ్రహ్మరథం పట్టారు. మెగా అభిమానులు క్యూ కట్టారు. దీంతో `గూండా` బాక్సాఫీసు వద్ద రచ్చ చేసింది. చాలా రోజులు విజయవంతంగా ప్రదర్శించబడింది.
మెగాస్టార్ `గూండా` దెబ్బకి సూపర్ స్టార్ కృష్ణ నటించిన `రక్తసంబంధం` చిత్రం కుదేలైపోయింది. కోలుకోలేకపోయింది. మాస్ ఆడియెన్స్ అంతా చిరు మూవీకి క్యూ కట్టడంతో హిట్ కావాల్సిన కృష్ణ `రక్తసంబంధం` కాస్త అడ్రస్ లేకుండాపోయింది. జస్ట్ బిలో యావరేజ్‌గా మిగిలిపోయింది. దీంతో రిజల్ట్ చూసి కృష్ణ తలపట్టుకునే పరిస్థితి వచ్చిందట. అయితే ఆయన భోళా మనిషి కావడంతో ఈ ఫలితాన్ని కూడా నవ్వుతూనే తీసుకున్నారని సమాచారం. మొత్తంగా చిరంజీవి `గూండా`.. కృష్ణ `రక్తసంబంధం` కలెక్షన్లకి పెద్ద ఎత్తున గండి కొట్టింది.
55
క్రేజీ లైనప్‌తో దూసుకుపోతున్న చిరంజీవి
బాక్సాఫీసు వద్ద ఇలా చిరంజీవి, సూపర్ స్టార్ కృష్ణ చాలా సార్లు పోటీ పడ్డారు. కొన్నిసార్లు కృష్ణ, మరికొన్ని సార్లు చిరంజీవి పైచేయి సాధించారు. ఇండస్ట్రీలో ఇలాంటి పోటీ కామన్ అనే చెప్పాలి. అయితే ఎవరైనా వీటిని స్పోర్టీవ్‌గా తీసుకుని మంచి సినిమాలు చేసేందుకు తపించేవారు. ఆడియెన్స్ ని అలరించేందుకు పోటీ పడేవారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక మూడేళ్ల క్రితం సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తున్నారు. భారీ లైనప్‌తో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన `విశ్వంభర`, `మన శంకరవరప్రసాద్ గారు` చిత్రాల్లో నటిస్తున్నారు.