దివి చంకనెక్కిన మెహబూబ్: తీరొక్క వేషాలు

First Published Dec 18, 2020, 4:06 PM IST

బిగ్ బాస్ సీజన్ 4 పాల్గొన్న కంటెస్టెంట్స్ బయట సందడి చేస్తున్నారు. ఎలిమినేటై బయటికి వచ్చిన గంగవ్వ, దివి, మోనాల్, దిల్ సే మెహబూబ్, లాస్య, ముక్కు అవినాష్ వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. బిగ్ బాస్ ద్వారా వచ్చిన ఫేమ్ ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ సెలెబ్రిటీలు. తమతో పాటు హౌస్ లో ఉన్న తోటి కంటెస్టెంట్స్ ని కలిసి ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నారు. 

లాస్య, గంగవ్వఇంటికి వెళ్లడం జరిగింది. గంగవ్వఇల్లు మరియు పొలాలలో ఇద్దరూ సందడి చేయగా... సదరు వీడియో లాస్యతన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేయడం జరిగింది. లక్షల్లోఈ వీడియోలకు వ్యూస్ వస్తుండగా వీళ్ళ వ్యాపారం మంచిగా ఉంది.
undefined
ఇక ఈ సీజన్ కి గాను హౌస్ లో కండల వీరుడిగా సందడి చేసిన మెహబూబ్, హౌస్ నుండి బయటికి వచ్చాక... తన సొంత ఊరు గుంటూరుకి వెళుతున్న వీడియో చేయడం జరిగింది. మెహబూబ్ కి గుంటూరులో ఘన స్వాగతం లభించగా... తన ఇల్లు, పేరెంట్స్ ని పరిచయం చేశాడు.
undefined
తాజాగా దిల్ సే మెహబూబ్ తోటి కంటెస్టెంట్ బ్యూటీ దీవిని కలిచారు. వీళ్ళిద్దరూ క్రేజీ పోజులలో సోషల్ మీడియాలో పోస్ట్స్ పెట్టారు. ఏకంగా దివి, మెహబూబ్ ని పైకి ఎక్కించుకుంది. తనను పైకి ఎక్కించుకున్న దివిని ఓ స్పెషల్ కోటేషన్ తో పొగిడేశాడు మెహబూబ్.
undefined
'బ్యూటీ విత్ బ్రైనేకాదు... బ్యూటీ విత్ బలం కూడా' అని ఆమెను పొగిడేశాడు. మెహబూబ్ ని చంకలో పెట్టుకొని స్మైల్ ఇస్తున్నదివిని చూసిన ఫ్యాన్స్కేజ్రీగా ఫీలవుతున్నారు. దివికి అందంతోపాటు కండ బలం కూడా ఉందని ఆ ఫోటో చూస్తే అర్థం అవుతుంది.
undefined
బిగ్ బాస్ ద్వారా వచ్చిన ఫేమ్ తో దివి హీరోయిన్ గా బిజీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆమె రెండు సినిమాలకు సైన్ చేశారని వినికిడి. దర్శక నిర్మాతలు ఆమెకు హీరోయిన్ ఆఫర్స్ ఇస్తున్నట్లు తెలుస్తుంది.
undefined
వస్తున్న అవకాశాల నుండి ఆచితూచిదివి సినిమాలు ఎంచుకుంటుంది అట. ముఖ్యంగా ఓటిటిప్లాట్ ఫార్మ్స్లో నిర్మితంఅవుతున్న స్మాల్ బడ్జెట్ చిత్రాలకుదివి బెస్ట్ ఛాయిస్ గా మారినట్లు తెలుస్తుంది.
undefined
ఇక దిల్ సే మెహబూబ్ యూట్యూబ్ వీడియోస్ కి లక్షలలో వ్యూస్ వస్తున్నాయి. ఈ మధ్యనే సోహెల్ ఇంటికి వెళ్లిన వీడియోని మెహబూబ్ పోస్ట్ చేయగా, మంచి ఆదరణ దక్కింది. మొత్తంగా బిగ్ బాస్ షో వీళ్లకు లైఫ్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
undefined
click me!