జబర్దస్త్ కమెడియన్ ఇంట పెళ్లి సందడి... బిగ్ బాస్ కంటెస్టెంట్ అవినాష్ రచ్చ!

First Published Jan 8, 2021, 11:43 AM IST

జబర్ధస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ ఇంట పెళ్లి సందడి నెలకొనగా... బిగ్ బాస్ కంటెస్టెంట్ అవినాష్ హాజరై సందడి చేశారు. 
 

ప్రీ వెడ్డింగ్ సెరిమోని అయిన పసుపు కార్యక్రమంలో అవినాష్ పాల్గొన్నారు.రాకింగ్ రాకేష్ తమ్ముడు వివాహం కాగా నివాసంలో పసుపు వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో బిగ్ బాస్ కంటెస్టెంట్ అవినాష్ పాల్గొనడం జరిగింది.
undefined
అలాగే జబర్ధస్త్ కమెడియన్స్, యాంకర్స్ కూడా హాజరయ్యారు.యాంకర్ రవి, జబర్ధస్త్ సుధాకర్, బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ జోర్దార్ సుజాతలతో పాటు ధనాధన్ ధన్ రాజ్ హాజరయ్యారు. బుల్లితెర సెలబ్రిటీలు పాల్గొన్న ఈ వేడుక విశేషత సంతరించుకుంది.
undefined
ముఖ్యంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ అవినాష్ ఈ వేడుకలో ప్రత్యేకంగా నిలిచారు. పసుపు వేడుకకు వచ్చిన అవినాష్ వరుడుతో పాటు బంధువులతో ఫోటోలకు పోజిచ్చారు.
undefined
రాకింగ్ రాకేష్, అవినాష్ కి మంచి మిత్రుడు. చాలా కాలం వీరు జబర్ధస్త్ లో పని చేయడం జరిగింది. ఆ సాన్నిహిత్యంతో అవినాష్ ఈ వేడుకకు హాజరు కావడం జరిగింది.
undefined
బిగ్ బాస్ షో కోసం అవినాష్ జబర్ధస్త్ నుండి బయటికి రావడం జరిగింది. టీమ్ లీడర్ అనేక స్కిట్స్ చేసిన అవినాష్.. సక్సెస్ ఫుల్ కమెడియన్ అనిపించుకున్నారు.
undefined
click me!