రామ్ చరణ్ పై మనసు పారేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. మెగా పవర్ స్టార్ తో ఆపనిచేయాలని ఉందట..?

Published : Aug 03, 2023, 11:24 AM IST

పెళ్ళిపై తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పేసింది యూట్యూబ్ స్టార్ సరయూ. అంతే కాదు టాలీవుడ్ మెగా పవర్ స్టార్ అంటే ఫుల్ క్రష్ అంటుంది బ్యూటీ. చరణ్ ఒప్పుకుంటే.. సై అంటోంది.   

PREV
16
రామ్ చరణ్ పై మనసు పారేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ.. మెగా పవర్ స్టార్ తో ఆపనిచేయాలని ఉందట..?

ఈ మధ్య బిగ్ బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేసింది ప్రముఖ  యూట్యూబర్.. సరయూ. కాంట్రవర్షియల్ కామెంట్స్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది సరయూ.. యూట్యూబర్ గా తాను చేసే వీడియోలు కూడా... ఘాటుగానే ఉంటాయి. ఈక్రమంలో ఆమె తాజాగా పెళ్లి పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

26

బిగ్ బాస్ తో పాటు..బిగ్ బాస్ ఓటీటీలో కూడా కంటెస్టెంట్ గా హాట్ టాపిక్ అయ్యింది. ప్రముఖ యూట్యూబర్ సరయూ. బిగ్ బాస్ నుంచి మధ్యలోనే ఆమె బయటకు వచ్చేసింది. తాను ఈ షోకి వెళ్లానని, అక్కడ ఏం జరుగుతుందో తనకు తెలుసునని ఆమె అన్నారు. రెండు సార్లు హౌస్ లోకి వెళ్లిన సరయూ.. ఇలా మాట్లాడటం అందరికి షాక్ కలిగిస్తుంది. 

36

బూతులతో కూడిన సినిమా రివ్యూలు, అడల్ట్ కామెడీ స్కిట్స్ తో సరయు యూట్యూబ్ స్టార్ గా ఎదిగారు. ఒక అమ్మాయి నోటి నుండి బూతులు వినడం ఎంజాయ్ చేసే జనాలకు సరయు యాటిట్యూడ్ భలే నచ్చేస్తుంది. 

46

బిగ్ బాస్  షో మొత్తం ఫేక్ అని, ఆ షో మొత్తం డబ్బుతోనే నడుస్తుందని, డబ్బు ఎక్కువ ఎవరు ఇస్తే వారికే టైటిల్ అంటూ ఇలా సంచలన కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. నెటిజన్ల నుంచి రకరకా కామెంట్లు కూడా వినిపించాయి. ఈక్రమంలో ఆమె మరోసారి పెళ్లి గురించి, హీరో రామ్ చరణ్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 
 

56

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సరయు తనకి పెళ్లి మీద అంతగా నమ్మకం లేదని, పెళ్లి చేసుకోవడం సుద్ధ వేస్ట్ అంటూ చెప్పేసింది. అంతేకాదు పెళ్లి చేసుకునే ఆలోచన లేదు.. అంటోంది. దీంతో సరయూ పెళ్ళి చేసుకోకుండా.. లైఫ్ టైమ్ బ్యాచిలర్ గా ఉండబోతుందటున్నారు. అయితే ఈక్రమంలో ఆమె రామ్ చరణ్ పూ కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది. 

66

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెళ్లి జరిగిన రోజు చాలా ఏడ్చానని, నాకు రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం అని,ఒకవేళ రామ్ చరణ్ తో డేటింగ్ చేసే అవకాశం వస్తే అస్సలు వదులుకోను అంటూ ఓపెన్ గానే చెప్పేసింది సరయూ. మెగా పవర్ స్టార్ పై ఆమె చేసిన కామెంట్ కు రకరకాలుగా రిప్లైలు వస్తున్నాయి. 
 

click me!

Recommended Stories