నేను ప్రేమించింది అతన్నే, పెళ్లి కూడా అయిపోయింది... ఫైనల్లీ తేల్చేసిన రష్మిక మందాన!

Published : Aug 03, 2023, 11:12 AM IST

హీరోయిన్ రష్మిక మందాన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఓ ఈవెంట్లో పాల్గొన్న రష్మిక ఓ వ్యక్తిని ప్రేమించాను. అతనితో పెళ్లి కూడా అయిపోయిందని బాంబు పేల్చింది.   

PREV
17
నేను ప్రేమించింది అతన్నే, పెళ్లి కూడా అయిపోయింది... ఫైనల్లీ తేల్చేసిన రష్మిక మందాన!
rashmika mandanna

రష్మిక మందాన వ్యక్తిగత జీవితంపై అనేక రూమర్స్ ఉన్నాయి. హీరో విజయ్ దేవరకొండతో ఆమె ఎఫైర్ లో ఉన్నారనేది ప్రముఖంగా వినిపిస్తున్నమాట. ముంబై వీధుల్లో పలుమార్లు జంటగా దొరికారు. డిన్నర్ నైట్స్, మాల్దీవ్స్ వెకేషన్స్ ఎంజాయ్ చేశారు. కానీ మేము మిత్రులమే అంటారు. 


 

27

కాగా రష్మిక ఎట్టకేలకు ఓపెన్ అయ్యింది. తనకు మనసైన వాడు ఎవడో నేరుగా చెప్పింది. ఆ వ్యక్తితో రష్మికకు వివాహం కూడా జరిగిందట. ఆ వ్యక్తి పేరు నరుటో అట. ఇంతకీ ఎవరీ నరుటో అని వాకబు చేస్తే మైండ్ బ్లాక్ అయ్యింది. ఓ ముంబై ఈవెంట్లో పాల్గొన్న రష్మికను ప్రేమ గురించి అడిగారు. అందుకు ఆమె ఊహించని సమాధానం చెప్పింది. 

37


నాకు ఆల్రెడీ నరుటో తో పెళ్లైంది. నా మనసులో ఉంది అతడే, అని చెప్పింది. నరుటో అంటే ఓ కామిక్ సిరీస్ క్యారెక్టర్. ఆ పాత్ర అంటే తనకు ఎంతో ఇష్టమని. నరుటోతో నాకు పెళ్లి కూడా అయిపోయిందని రష్మిక ఫన్నీ ఆన్సర్ ఇచ్చారు. పరోక్షగా తాను సింగిల్ అని చెప్పారు. 

47

ఇక కెరీర్ బిగినింగ్ లో రష్మిక మందాన హీరో రక్షిత్ శెట్టిని ప్రేమించారు. ఆమె డెబ్యూ మూవీ కిరిక్ పార్టీ షూటింగ్ లో వీరు దగ్గరయ్యారు. నిశ్చితార్థం కూడా జరిగింది. కొద్ది రోజుల్లో పెళ్లి అనగా రష్మిక మందాన మనసు మారింది. వివాహమైతే సిల్వర్ స్క్రీన్ వదిలేయాల్సి వస్తుందని భయపడింది. దాంతో పెళ్లి క్యాన్సిల్ చేసుకుని బాయ్ ఫ్రెండ్ కి గుడ్ బై చెప్పేసింది. 

 

57

ఇక రష్మిక కెరీర్ పీక్స్ లో ఉంది. ఈ స్టార్ లేడీ బడా బడా స్టార్స్ తో సినిమాలు చేస్తున్నారు. పుష్ప మూవీతో రష్మిక మందాన ఇండియా వైడ్ ఫేమ్ తెచ్చుకున్నారు. అనతి కాలంలో ఎదిగిన ఈ లక్కీ లేడీ సౌత్ టు నార్త్ దున్నేస్తున్నారు. 

67

పుష్ప 2, యానిమల్ చిత్రాల్లో రష్మిక నటిస్తున్నారు. పుష్ప 2 రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో దర్శకుడు సుకుమార్ భారీగా తెరకెక్కిస్తున్నారు. పార్ట్ 1 సక్సెస్ నేపథ్యంలో మరింత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. రన్బీర్ కపూర్ కి జంటగా నటించిన యానిమల్ డిసెంబర్ 1న విడుదల కానుంది. రైన్ బో టైటిల్ తో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్నారు.

 

77

నితిన్-వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రకటించిన మూవీలో కూడా రష్మిక మందాన హీరోయిన్. అయితే డేట్స్ కుదరక ప్రాజెక్ట్ నుండి తప్పుకుండానే ప్రచారం జరుగుతుంది. దీనిపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories