బిగ్ బాస్ శోభా శెట్టి బాయ్ ఫ్రెండ్ గురించి తెలుసా? మూడేళ్లుగా రిలేషన్ లో ఉంది ఈయనతోనేనా.!

First Published | Nov 13, 2023, 3:07 PM IST

బిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్ శోభా శెట్టి (Shobha Shetty)  తాజా ఎపిసోడ్ లో తన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పింది. మరోవైపు బిగ్ బాస్ కూడా ఆమెకు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇంతకీ అతను ఎవరనేది తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 చాలా ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతోంది. మునపటి ఆరు సీజన్లకంటే ఈసారి మరింత ఆసక్తిగా షోను రన్ చేస్తున్నారు. హోస్ట్ గా నాగార్జున ఎప్పకటిప్పుడు ట్విస్టులు, సర్ ప్రైజ్ లు ఇస్తూ బీబీ లవర్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నారు. 

కొన్ని రోజులుగా బిగ్ బాస్ (Bigg Boss Telugu 7) హౌజ్లో ఫ్యామిలీ వీక్ రన్ అవుతోంది. ఈ సందర్భంగా కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ ను హౌజ్ లోకి తీసుకొస్తూ సర్ ప్రైజ్ ఇస్తున్నారు. కుటుంబ బంధాలను చూపించేలా ఎమోషనల్ గా షో రన్ అవుతోంది.


ఇక బిగ్ బాస్ తెలుగు దీపావళి స్పెషల్ ఎపిసోడ్ నిన్న మరింత ఆసక్తికరంగా సాగింది. సెలబ్రెటీలతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ ను హౌజ్ లోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ శోభా శెట్టి (Shobha Shetty)కి నాగ్  ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చారు. 

శోభాశెట్టి ప్రియుడు ఎవరనే విషయాన్ని నిన్నటి స్పెషల్ ఎపిసోడ్ లో బిగ్ బాస్ నిర్వాహకులు రివీల్ చేశారు. శోభా కూడా తన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పుకొచ్చింది. అతని పేరు యశ్వంత్ అని, తను ముద్దుగా పాపు అని పిలుచుకుంటానని చెప్పింది.

మూడున్నరేళ్లుగా వారు రిలేషన్ లో ఉన్నారని రిలీల్ చేసింది. ఇక బిగ్ బాస్ యశ్వంత్ ను, ఆమె తండ్రిని ఆహ్వానించారు. తన బాయ్ ఫ్రెండ్ ను స్టేజీపైకి పిలవడంతో శోభాశెట్టి చాలా సర్ ప్రైజ్ అయ్యింది. ఆనందంలో మునిగి తేలింది.

ఇంతకీ యశ్వంత్ ఎవరో కాదు.. ‘కార్తీక దీపంలో డాక్టర్ బాబు తమ్ముడే ఆయన. టీవీ ఆడియెన్స్ లో కాస్తా గుర్తింపు ఉన్న నటుడే కావడం విశేషం. ఈ సీరియల్ తోనే వీరిద్దకి మంచి స్నేహం ఏర్పడింది. తర్వాత ప్రేమగా మారింది. ఇక వీరి కాంబోలో ‘బుజ్జి బంగారం’ అనే చిత్రం కూడా వచ్చింది. అయినా వీరి ప్రేమ విషయం ఎక్కడా బయటపడలేదు. బిగ్ బాస్ నిర్వాహకులు దీపావళి ఎపిపోడ్ లో ఆమెతోనే చెప్పించడం విశేషం. 

Latest Videos

click me!