‘మౌనరాగం’, ‘జానకి కలగనలేదు’ సీరియల్ తో బుల్లితెర ఆడియెన్స్ ను తనవైపు తిప్పుకుంది ప్రియాంక జైన్ (Priyanka Jain). తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 7 (Bigg Boss Telugu) రియాలిటీ షోలో బెస్ట్ కంటెస్టెంట్ గా పేరు దక్కించుకుంటోంది.
అయితే, ప్రియాంకతో పాటు Mounraagam సీరియల్ లో లీడ్ యాక్టర్ గా నటించిన శివకుమార్ (Shiva Kumar)తో ఈ ముద్దుగుమ్మ లవ్ లో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా బిగ్ బాస్ హౌజ్ లోకి నిర్వాహకులు ఆమె ప్రియుడిని తీసుకొచ్చారు. వారి రొమాన్స్ ఏరేంజ్ లో ఉందో తెలిసిందే.
అయితే ప్రియాంక జైన్, శివకుమార్ ల లవ్ ట్రాక్ ఎలా ప్రారంభమైంది... ఎన్నేళ్లుగా రిలేషన్ లో ఉంటున్నారనే విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. వీరిద్దరు రెండేళ్లకు పైగా ప్రేమలో మునిగి తెలుతున్నారు. ‘మౌనరాగం’ సీరియల్ తోనే వీరిమధ్య ప్రేమ చిగురించింది.
ఆ సీరియల్ మూడేళ్ల పాటు టెలికాస్ట్ అయ్యింది. మూడేళ్లపాటు ప్రియాంక, శివకుమార్ సీరియల్ కోసం కలిసి పనిచేశారు. కానీ, రెండున్నరేళ్ల పాటు వీరిద్దరూ ఏమాత్రం మాట్లాడుకోలేదంట. చివరి ఆరు నెలల్లోనే ఒకరికొకరు బాగా దగ్గరయ్యారని ప్రియాంక తెలిపింది. శివకుమార్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
శివకుమార్ కోసం ప్రియాంక ఎంతగానో ఆలోచిస్తుందంట. శివకు వాచెస్ అండ్ షూస్ అంటే చాలా ఇష్టమంట. ఎంత ఖరీదైనా సరే కొంటుంటాడు. ఈ విషయంలో ప్రియాంక ఎప్పుడు అతన్ని అడ్డుకుంటుందంట. అయినా శివ కుమార్ కొంటూనే ఉంటాడంట. ఇలా శివకుమార్ గురించి ప్రతి విషయంలో ప్రియాంక కేర్ తీసుకుంటుంది.
ఇక వీరి లవ్ ట్రాక్ కు అభిమానులు కూడా ఉన్నారు. ‘శివ్ ప్రియాంక’ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు కూడా. సోషల్ మీడియాలో వారు పంచుకున్న ఫొటోలను, వెకేషన్ల ను ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తుంటారు. ఇక ప్రియాంక ప్రస్తుతం బిగ్ హౌజ్ లో గట్టి పోటీని ఇస్తోంది. తన ఆటతో ప్రేక్షకుల మద్దతు పొందుతోంది.