ఛీ ఛీ నీతో నాకేంటి.. నీ క్యారెక్టరే అశుద్ధం అంటూ గీతూపై రేవంత్ ఫైర్, నామినేషన్స్ లో రభస..

Published : Sep 12, 2022, 11:11 PM IST

బిగ్ బాస్ సీజన్ 6 గత సీజన్స్ కంటే కాస్త భిన్నంగానే ఉంటోంది. ప్రేక్షకులని ఆకట్టుకునేందుకు బిగ్ బాస్ ఊహించని సర్ప్రైజ్ లు ఇస్తున్నారు.

PREV
16
ఛీ ఛీ నీతో నాకేంటి.. నీ క్యారెక్టరే అశుద్ధం అంటూ గీతూపై రేవంత్ ఫైర్, నామినేషన్స్ లో రభస..

బిగ్ బాస్ సీజన్ 6 గత సీజన్స్ కంటే కాస్త భిన్నంగానే ఉంటోంది. ప్రేక్షకులని ఆకట్టుకునేందుకు బిగ్ బాస్ ఊహించని సర్ప్రైజ్ లు ఇస్తున్నారు. ఫార్మాట్ అలాగే ఉన్నప్పటికీ హౌస్ మేట్స్ మధ్య జరుగుతున్న సంభాషణలతో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. బిగ్ బాస్ సీజన్ 6లో 9వ రోజు హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. 

26

శ్రీసత్య, శ్రీహన్, రేవంత్, అర్జున్ కళ్యాణ్ మధ్య సంభాషణతో 9వ రోజు ఎపిసోడ్ మొదలవుతుంది. తన క్యారెక్టర్ గురించి శ్రీసత్య వివరిస్తుంది. ఫ్రెండ్లిగా తనని భుజం మీద టచ్ చేస్తే ఒకే.. అలాగే సైడ్ హగ్ ఇచ్చినా ఒకే. అంతకు మించి నన్ను టచ్ చేయాలని చూస్తే నేను సహించను అని వార్నింగ్ ఇస్తుంది. ఇంతలో ఇనయ సుల్తానా మైక్ మిస్ అవుతుంది. గంట నుంచి వెతికినా కనిపించదు. చివరకు ఆమె మైక్ సూర్య వద్ద ఉంటుంది. 

36

దీనితో ఇనయ తన మైక్ ని కావాలనే దాచి పెట్టారు అంటూ కెప్టెన్ బాలాదిత్యకి కంప్లైంట్ చేస్తుంది. ఇంతలో సూర్య, ఆరోహి మధ్య సరదా గొడవ జరగడం.. అంతలోనే ఇద్దరూ కలిసి పోవడం జరుగుతుంది. ఈ చిలిపి గొడవలో ఆరోహి చెప్పే మాటలు ఫన్నీగా ఉంటాయి. నీ వల్ల నేను ఎలిమినేట్ అయితే ఊరుకోను. నేను బయటకి వెళ్లి నువ్వు కూడా ఎలిమినేట్ అయ్యేలా చేస్తా అని అంటుంది. నైట్ టైంలో సూర్య, ఫైమా అల్లరి పని చేస్తారు. వీరితో ఆరోహి కూడా జాయిన్ అవుతుంది. 

46

వంటగదిలో ఉన్న తినుబండారాలని అందరూ నిద్ర పోయిన తర్వాత వీరు ముగ్గురూ తీసుకుని తినేస్తారు. ఇక చలాకి చంటి హాయిగా రిలాక్స్ అవుతూ తనకి కనిపించిన వారందరిపై జోకులు వేస్తూ నవ్విస్తుంటాడు. ఇంతలో ఈ వారం నామినేషన్ ప్రక్రియని బిగ్ బాస్ ప్రారంభిస్తారు. ఇంటి సభ్యులు ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో చెప్పి వారి ఫోటోని కుండకు అతికించి బావిలో పడేయాలి. నామినేట్ చేయడానికి గల కారణం చెప్పాలి. 

56

ఈ ప్రాసెస్ లో గీతూని శ్రీహన్, నేహా, చంటి, రేవంత్, పింకీ నామినేట్ చేస్తారు. ఇక రేవంత్ ని గీతూ, ఫైమా, అర్జున్, కీర్తి నామినేట్ చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్కరిని నామినేట్ చేస్తారు. ఈ ప్రక్రియలో అత్యధిక ఓట్లు వచ్చిన రాజ్, షాని, అభినయ, రోహిత్ -మెరీనా, ఆది రెడ్డి, గీతూ, రేవంత్, ఫైమా ఈ వారం నామినేట్ అవుతారు. 

66

ఈ నామినేషన్ ప్రాసెస్ లో రేవంత్, గీతూ మధ్య పెద్ద వాగ్వాదమే జరుగుతుంది. ఒకరి క్యారెక్టర్ మీద మరొకరు విమర్శలు చేసుకుంటారు. తానూ ఎవరి కోసమో మారను అని గీతూ అంటుంది. అసలు నీతో మాట్లాడకూడదు అని అనుకున్నా. ఛీ ఛీ అసలు నేనేంటి  ఈ పిల్లని నామినేట్ చేసేది అనుకున్నా అని రేవంత్ అంటాడు. దీనితో గీతూ ఎగస్ట్రాలు వద్దు అంటూ వార్నింగ్ ఇస్తుంది. అశుద్ధం మీద రాయి వేస్తే నా మీదే పడుతుంది.. అలాంటి క్యారెక్టర్ నువ్వు అంటూ రేవంత్ గీతూపై ఒక రేంజ్ లో ఫైర్ అవుతాడు. బిగ్ బాస్ నామినేట్ ఐన వారి పేర్లు ప్రకటించడంతో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. 

click me!

Recommended Stories