ఇంటి సభ్యులంతా కోడి నుంచి గుడ్లు సేకరించే పనిలో ఉంటారు. వారు పొందిన గుడ్లని బుట్టలో దోచుకుంటుంటారు. ఈ లోపు బిగ్ బాస్.. జెస్సికి సీక్రెట్ గా ఓ టాస్క్ ఇస్తారు. హౌస్ లో ముగ్గురు సభ్యులని ఎంచుకుని వారి వద్ద గుడ్లు లేకుండా చేయాలి. అలా చేస్తే నేరుగా కెప్టెన్సీ టాస్క్ కు ఎంపికయ్యే అవకాశం లభిస్తుంది అని జెస్సీకి బిగ్ బాస్ చెబుతారు. అవసరమైతే ఈ సీక్రెట్ టాస్క్ లో ఒకరి హెల్ప్ తీసుకోవచ్చు అని చెబుతారు. దీనితో జెస్సి.. Siri హెల్ప్ తీసుకుంటాడు. షణ్ముఖ్, ప్రియాంక, ప్రియా లని జెస్సి టార్గెట్ చేస్తాడు. సిరి సాయంతో వారి నుంచి గుడ్లు దొంగిలించే ప్రయత్నం చేస్తాడు.